అత్యాచార ఆరోపణలతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై కేసు

by RMK NEWS
0 comments

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు ఆయనపై లైంగిక ఆరోపణల కేసు నమోదు చేశారు. తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. సదరు మహిళ రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేయడంతో రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ కేసును నార్సింగి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. నార్సింగి పోలీసులు ఈ కేసుపై విచారణ చేపట్టారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like