- మాదాపూర్ లో 100 అడుగుల రోడ్డులో ఏర్పాటు
- సీబీఐఎన్ ఫోరం వ్యవస్థాపకుడు జెనెక్స్ అమర్ ఆధ్వర్యంలో
- పేద వారికి ఒక్కపూటైనా కడుపు నింపాలంటే లక్ష్యమన్న అమర్
ముద్ర,హైదరాబాద్:- తెలంగాణలో తొలి అన్న క్యాంటీన్ హైదరాబాద్ లో కనిపిస్తోంది. సీబీఐఎన్ ఫోరం వ్యవస్థాపకుడు జెనెక్స్ అమర్ ఈ క్యాంటీన్‌ను కలిగి ఉన్నారు. పేద వారికి కనీసం ఒక్క పూటైనా కడుపునిండా తిండి పెట్టాలనే ఉద్దేశంతో ఈ క్యాంటీన్ ను ప్రారంభించినట్లు అమర్ వివరించారు. ఐదు రూపాయలకే కడుపు నిండా తినే అవకాశం ఈ క్యాంటీన్ ద్వారా కలుగుతుందని చెప్పారు. ఇక్కడ భోజనం చేసే వారి ఆశీస్సులతో చంద్రబాబు నిండునూరేళ్లు ఆరోగ్యంగా ఉంటారని, కోరుకుంటున్నట్లు అమర్ అన్నారు. పేదోళ్ల ఆశీస్సులు, భగవంతుడి ఆశీర్వాదంతో చంద్రబాబు మరింత ఆరోగ్యంగా ప్రజా సేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఈ అన్న క్యాంటీన్ ద్వారా రోజుకు 500 మంది పేద వారి ఆకలి తీర్చాలని పెట్టుకున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ లోని మాదాపూర్ లో 100 అడుగుల రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ అన్న క్యాంటీన్ విషయం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లలేదని అమర్ చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు చిక్కిన ఉంటారని, ఆయనకు వీలు చిక్కినపుడు మాట్లాడుతామని వివరించారు. క్యాంటీన్ ను ప్రస్తుతం తాను ఒక్కడినే ప్రారంభించినా.. స్నేహితులు, దాతల సహకారంతో సిటీ అంతటా ఇలాంటి క్యాంటీన్లను విస్తరించే ఆలోచన ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు ఎందరో పేదల ఆకలి తీర్చి వారి ఆదరణ పొందారని అమర్ అన్నారు. చంద్రబాబు స్ఫూర్తితో తెలంగాణలో సైతం అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశామని ఆయన ఏర్పాటు చేశారు.
Get real time update about this post category directly on your device, subscribe now.