ముద్ర,సెంట్రల్ డెస్క్:-ఇటీవల ఓ పాఠశాల ప్రారంభోత్సవానికి వెళ్లిన పుష్ప విలన్ – ఫహాద్ తనకు ఓ అరుదైన వ్యాధి ఉందని చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చాడు. కేరళలోని ఒక చిరన్ రీ హాబిలిటేషన్ సెంటర్ ఓపెనింగ్‌కి ముఖ్య అతిథిగా హాజరైన ఫహాద్ తాను ఏడీహెచ్‌డీ వ్యాధి బారిన పడ్డానని తెలిపాడు. ఏడీహెచ్‌డీ అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టీవ్ డిసార్డర్.
ఈ వ్యాధి ఉన్నవారిలో ఏకాగ్రత లేకపోవడం, హైపర్ యాక్టటివ్, హైపర్ ఫోకస్ వంటి లక్షణాలు ఉంటాయన్నాడు. 41 ఏళ్ల వయసులో ఈ అరుదైన వ్యాధి బారిన పడ్డట్లు చెప్పుకొచ్చాడు. ఇక వ్యాధికి చికిత్స విషయమై ప్రశ్నించిగా.. చిన్నతనంలోనే బయటపడితే నయం చేసే అవకాశం ఉండేదన్నాడు. కానీ తనకు 41 ఏళ్ల వయసులో బయటపడింది. ఇక తాను జీవితాంతం ఈ వ్యాధితో బాధపడాల్సిందే అని వాపోయాడు.
Get real time update about this post category directly on your device, subscribe now.