ముద్రణ, హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ జీనియస్ ఇంగ్లీష్ మీడియా పాఠశాలలో పండుగల సంస్కృతిని ప్రతిబింబిస్తూ, కృష్ణాష్టమి ముందస్తు వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ప్రముఖంగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వీరేందర్ రెడ్డి ఆద్వర్యం. చిన్న పిల్లలందరూ బాల కృష్ణుడు, గోపికల వేషధారణతో తమ ముద్దుల ముద్దుల మాటలతో చూపరులను ఆకర్షించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో, ఆటపాటలతో అలరించారు. శ్రీకృష్ణుని దశావతారాల ప్రదర్శన కన్నులకు కట్టినట్లు చూపించారు. రాధాకృష్ణులుగా చిన్నారులు సందడి చేశారు. భగవద్గీతా పఠనం చేయించారు.
పండుగ సంప్రదాయంలో భాగంగా కోలాటం ఆడి ఉత్సాహంగా ఉట్టికొట్టే కార్యక్రమం జరిగింది. చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు మన సంస్కృతి సంప్రదాయాలు, పండుగ విశిష్టతల గురించి తెలియచెప్పాల్సిన అవసరం ఉంది. ధర్మానికి ఎప్పుడు కలుగుతుందో అప్పుడు ఆ ధర్మాన్ని పునరుద్ధరించటానికి నన్ను నేను సృష్టించుకుంటానని శ్రీకృష్ణుడు అర్జునిడికి తెలిపాడని అన్నారు.
భారతయుద్ధంలో పాండవుల పక్షాన ఉండి ధర్మాన్ని గెలిపించి అధర్మంగా వ్యవహరించిన కౌరవుల ఓటమికి కీలకపాత్ర వహించాడని చెప్పారు. భూలోకంలో ధర్మం గతి తప్పినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించాడని పురాణాల ద్వారా తెలుస్తున్నాడు. శ్రీకృష్ణాష్టమి పండుగ విశిష్టత గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు, ఉపాద్యాయులు ఉన్నారు.
Get real time update about this post category directly on your device, subscribe now.