ఏపీలో మరో ప్రభుత్వ పథకానికి పేరు మార్పు…. – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – RMK News

by RMK NEWS
0 comments
ఏపీలో మరో ప్రభుత్వ పథకానికి పేరు మార్పు.... - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



2

ఏపీలో ఇంత‌కుముందు వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ప‌లు ప‌థ‌కాల పేర్ల‌ను కూట‌మి ప్ర‌భుత్వం ఇప్ప‌టికే మార్చిన విష‌యం తెలుస్తుంది. ఇదే కోవలో ఇప్పుడు మరో పథకం పేరు మార్చబడింది. జ‌గన్ సర్కార్ అమ‌లు చేసిన ‘శాశ్వ‌త భూ హ‌క్కు-భూ ర‌క్ష‌ణ’ ప‌థ‌కం పేరును ‘ఏపీ రీ స‌ర్వే ప్రాజెక్టు’గా మార్పు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు తాజా శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

కాగా, ఈ స్కీమ్ ను గ్రామాల్లో భూవివాదాలు, తగాదాలు లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో తీసుకువెళ్లామని అప్పట్లో జగన్ ప్రభుత్వం. భాగంగా భూములు స‌మ‌గ్ర రీ స‌ర్వే చేప‌ట్టారు. కానీ, ఈ ప‌థ‌కం ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చేస‌రికి భారీ ఎత్తున అవ‌క‌త‌వ‌క‌లు చోటు చేసుకున్న‌ట్టు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. వీరితో బాధితులు ‘శాశ్వ‌త భూ హ‌క్కు-భూ ర‌క్ష‌ణ’ ప‌థ‌కంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఈ నేపథ్యంలో, ఈ స్కీమ్ అమలు తీరును అప్ప టి ప్ర తిప క్షం టీడీపీ తీవ్రంగా ఖండించింది. తాము అధికారంలోకి వ‌స్తే ఈ స్కీమ్‌ను పూర్తిగా ప్ర‌క్షాళన చేయ‌డం జ‌రుగుతుంద‌ని పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో ‘శాశ్వ‌త భూ హ‌క్కు-భూ ర‌క్ష‌ణ ప‌థ‌కం’ పేరు మారుస్తూ ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like