ముద్ర,ఆంధ్రప్రదేశ్:- వైసిపి ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించిందని మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడం చంద్రబాబును ప్రజాప్రభుత్వాన్ని నిర్ణయించింది.ఇందులో భాగంగా.. గత సీఎం జగన్ పేరుతో ఏర్పాటు చేసిన పథకాలకు స్వస్తి చెప్పినట్లు తెలిపారు.
పథకాలకు భరతమాత ముద్దు బిడ్డల పేర్లు పెట్టాలని నిర్ణయించాం. అబ్దుల్ స్ఫూర్తితో నూతన పథకాల పేర్లు ఉన్నాయి. జగనన్న అమ్మఒడి పథకం పేరు ‘ తల్లికి వందనం’, జగనన్న విద్యాకానుక పేరు ‘ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’గా జగనన్న గోరు ముద్ద పేరు ‘ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం’, మన బడి నాడు-నేడు పేరు ‘ మనబడి- మన భవిష్యత్తు’గా, స్వేచ్ఛ పథకం పేరు ‘ బాలికా రక్ష’గా జగనన్న ఆణిముత్యాల పేరును ‘అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం’గా మార్చినట్లు ఎక్స్ వేదిగా.
అయిదేళ్లపాటు గత ప్రభుత్వం భ్రష్టుపట్టించిన విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని చంద్రబాబునాయుడు గారిని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో విద్యాలయాలను అతీతంగా సరస్వతీ నిలయాలుగా తీర్చిదిద్దాలన్నది మా సంకల్పం. ఇందులో భాగంగా గత ప్రభుత్వం నాటి… pic.twitter.com/r9O8C0EuW1
– లోకేష్ నారా (@naralokesh) జూలై 27, 2024
Get real time update about this post category directly on your device, subscribe now.