ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు జనవరి మాసంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ దిశా సమీక్ష సమావేశంలో గౌరవ శాసనసభ్యులు నియోజక వర్గాల వారీగా గ్రామాలలోని వివిధ సమస్యలను మహబూబాబాద్ ఖమ్మం గౌరవ ఎంపీల సమక్షంలో పరిష్కరించిన అంశాలను క్లుప్తంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ్ సహాయం రఘురామిరెడ్డి, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం మాట్లాడుతూ దారిద్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి పేద కుటుంబాలకు మరియు ఆదివాసి గిరిజన గ్రామాలలోని గిరిజన కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న సంక్షేమ పథకాలు చేరే విధంగా సంబంధిత శాఖల అధికారులు బాధ్యతగా పనిచేసే అమలయ్యే విధంగా చూడాలని అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమమే కాకుండా గిరిజన సంక్షేమంపై కూడా ప్రత్యేక దృష్టి సారించామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏడాది కొత్త కొత్త పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు బడ్జెట్ లో ఎక్కువ మొత్తం నిధులు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వాలు ఎంత కష్టపడి పని చేసిన నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుందని అన్నారు. పేదరిక నిర్మూలన నిరక్షరాస్యత బాల్య వివాహాలు బాలల హక్కులు బాల కార్మిక వ్యవస్థలపై మరింత కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరం ఉన్నదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా నియోజకవర్గాలలోని మారుమూల ప్రాంతాలలో కరెంటు సమస్య మంచినీటి సమస్య రోడ్ల సమస్య లేకుండా చూడాలని, అలాగే జిల్లా పరిషత్ పాఠశాలలు, గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలు, అంగన్వాడి సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మాతా శిశు కేంద్రాలలో అన్ని రకాల వసతి సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలని, జిల్లా కలెక్టర్ తో పాటు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తప్పనిసరిగా వారి పరిధిలోని అన్ని సెంటర్లను తనిఖీ చేస్తూ ఉండాలని ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకొని రావాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలయ్యే నిధులు నియోజకవర్గాల వారీగా సక్రమంగా వినియోగించడానికి జిల్లా కలెక్టర్ ఐటీడీఏ పీవో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని శాసనసభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి నియోజకవర్గాలలో నెలకొన్న వివిధ సమస్యలను గుర్తించి నిధులు కేటాయించి వెంటనే పనులు ప్రారంభించాలని అన్నారు. ముఖ్యంగా విద్య వైద్యం విద్యుత్ పబ్లిక్ హెల్త్ నేషనల్ హైవే రోడ్స్ కు సంబంధించిన శాఖలు ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు ప్రారంభించి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. వచ్చే సమావేశానికి గౌరవ శాసనసభ్యులు నియోజకవర్గం వారిగా లేవనెత్తిన వివిధ అంశాల యొక్క సమస్యలను సంబంధిత అధికారులు సమస్యలు పరిష్కరించి పూర్తిస్థాయి అందజేయాలని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఐటిడిఏ పిఓ రాహుల్ అదనపు కలెక్టర్ వేణుగోపాల్,ఎమ్మెల్యేలు తేల్లం వెంకట్రావు,పాయం వెంకటేశ్వర్లు మాలోతి రామదాస్, జారే ఆదినారాయణ,దిశ కమిటీ సభ్యులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Get real time update about this post category directly on your device, subscribe now.