కాంగ్రెస్ తో దోస్తీ చేస్తే మీ అయ్యేది – కేంద్రమంత్రి బండి సంజయ్ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – RMK News

by RMK NEWS
0 comments
కాంగ్రెస్ తో దోస్తీ చేస్తే మీ అయ్యేది - కేంద్రమంత్రి బండి సంజయ్ - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



2

  • చీకట్లో ఢిల్లీ పెద్దలను కలిసి డబ్బు సంచులు అప్పగించింది మీ అయ్యేది
  • ఇతర రాష్ట్రాల ఎన్నికలకు డబ్బు మూటలు పంపింది కేసీఆరే
  • మీకు దోస్తీ లేకుంటే ఆ కేసులు సీబీఐకి అప్పగించమనండి
  • మీ సంగతి అప్పుడు తేలుతుంది
  • మాకు…రేవంత్ తో దోస్తీ అవసరమేంది?
  • కేటీఆర్ ట్వీట్ పై నిప్పులు చెరిగిన కేంద్రమంత్రి బండి సంజయ్

ముద్ర, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ తో దోస్తీ చేస్తే మీకే అవుతుంది అంటూ మాజీ మంత్రి కేటీఆర్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ ఇచ్చారు. ”నాకు రేవంత్ రెడ్డితో దోస్తానా ఉంటే మీ ప్రభుత్వం పడిపోయే ప్రమాదముందని మీడియా ముందు మాట్లాడతమా? నేనే కాదు… ఎవరితోనైనా దోస్తానా? ఫోన్‌లో ఉంటే తప్ప మీడియాతో మాట్లాడరు కదా… అంతెందుకు మీ అయ్యకు కాంగ్రెస్ పెద్దలతో దోస్తానా కాబట్టే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసుల్లో అరెస్ట్ కాకుండా చీకట్లో ఢిల్లీకి పోయి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుకుని డబ్బు సంచులు ఇచ్చి వాస్తవం కాదా? ఆ కేసులు విచారణకు రాకుండా ఢిల్లీ పెద్దల మందు సాగిలపడ్డది నిజం కాదా?” అంటూ కేటీఆర్ మీద బండి సంజయ్ నిప్పులు చెరిగారు.

సీఎం రేవంత్ ను కాపాడేందుకు బండి సంజయ్ తాపత్రయపడుతున్నారంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ కు ఘాటుగా బదులిచ్చారు.ఈ విషయంపై శనివారం బీజేపీ రాష్ట్రాన్ని కలిసి మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉంది కదా…. రేవంత్ రెడ్డిపై ఓటుకు నోటు కేసు ఉన్నది కదా? ఎందుకు తేల్చలేకపోయారు? ఎందుకు ఆ కేసును నీరుగార్చారు? రేవంత్ తో దోస్తానా ఉన్నది మీకా? మాకా? అని కేటీఆర్ ను ప్రశ్నించారు. రేవంత్ తో దోస్తీ తమకేమి అవసరమని అన్నారు. కేటీఆర్ అహంకారంవల్లే బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు ఈ గతి పట్టిందని, అయినా కేటీఆర్ కు అహంకారం తగ్గలేదని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగే పరిస్థితి కూడా ఉంది.

కేటీఆర్ బాధ భరించలేకే వాళ్ల అయ్య కేసీఆర్ ఫాంహౌజ్ కే పరిమితమై పండుకున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. . కేటీఆర్ వల్ల బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా సర్వనాశనమవడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రతిరోజూ ఒక పేపర్ చూసి మొరుగుడు కాదు… నిరుద్యోగులను లాఠీఛార్జ్ చేసింది మీకే కదా అని కేటీఆర్ ను ప్రశ్నించారు. రైతులు, మహిళలు, ఉద్యోగులు, ఉపాధ్యాయ, విద్యార్థి వర్గాలను లాఠీలతో కొట్టించింది కాదా? దానికి ముందు సమాధానం చెప్పు? అయ్యప్ప సొసైటీ విషయంలో పైసలు దండుకుంది మీరు కాదా? మా గురించి మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్ కు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like