మూడవసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్రమోదీ మంత్రి వర్గంలో స్థానం సంపాదించి మరోసారి ప్రమాణ స్వీకారం చేసిన సామాజిక, సాధికారత కేంద్ర సహాయమంత్రి రామ్ దా అఠావలెను తెలంగాణాకి చెందిన సీనియర్ కాంగ్రెస్ లీడర్, ఎ.ఆర్.మల్లు ఫౌండేషన్ చైర్మన్ మల్లు శివరాం నేషనల్ అంబేడ్కర్ సేన తరపున సన్మానించారు. రామ్ దాస్ అఠావలె గత మూడు దశాబ్దాలుగా దళిత, బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికోసం పాటుపడుతున్నారు. ఆయన సేవలను మెచ్చి… నరేంద్రమోదీ మరోసారి మంత్రిని చేసిన సందర్భంగా ఆయన నివాసంలో కలిసి మల్లు శివరాం నేషనల్ అంబేద్కర్ సేన తరపున పుష్పగుచ్ఛం ఇచ్చి… శాలువాతో సన్మానించారు.
కేంద్రమంత్రి సేవలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని. అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం, సాధికారత లభించినప్పుడే అంబేడ్కర్ ఆశయాలు నేరవేరినట్లని ఆయన పేర్కొన్నారు. గత మూడున్నర దశాబ్దాలుగా రామ్ దాస్ రాజకీయాల్లో రాణిస్తూ… పేదలకు ఆయన చేస్తున్న సేవలు అభినందనీయం అన్నారు. తన తండ్రి గారైన స్వర్గీయ కీర్తిశేషులు మల్లు అనంత రాములు కూడా కాంగ్రెస్ పార్టీకి కొన్ని దశాబ్దాల పాటు సేవలు అందించారు. ఆయన స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిర గాంధీ గారికి ఎంతో నమ్మకంగా మెలిగారు… అలాగే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి పీసీ అధ్యక్షునిగా సేవలు అందించారు.
ఇప్పుడు తమ బాబాయిలైన మల్లు భట్టి విక్రమార్క, మల్లు రవిలు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి తోడ్పడుతున్నారని అన్నారు. ఎ.ఆర్.మల్లు ఫౌండేషన్ ద్వారా అనేక సేవాకార్యక్రమాలు ఆయన చెప్పారు. నరేంద్రమోడీ మంత్రి వర్గంలో తన మిత్రుడు రామ్ దాస్ కేంద్ర సహాయ మంత్రి పదవిని పొందడం ఆనందంగా ఉందని చెప్పారు. ఒక మిత్రునిగా ఆయనను ఇలా సన్మానించడం చాలా ఆనందంగా జరిగింది. పార్టీలకు అతీతంగా తమ స్నేహం కొనసాగుతుందని అన్నారు. ఇద్దరి ఆశయాలు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని సాధించడమేనని… వాటికోసం పాటుపడతాం అని అన్నారు. ఎప్పటికీ తమ స్నేహం కొనసాగుతుందని చెప్పారు.
Get real time update about this post category directly on your device, subscribe now.