- గణేష్ శోభాయాత్ర లో డీజే, బాణాసంచా నిషేధం
- కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఐపీఎస్
ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : గణేష్ నిమజ్జన కార్యక్రమం సందర్బంగా జరిగే శోభయాత్ర రూట్ లు, నిమజ్జన కేంద్రాలైన మానకొండూరు చెరువు, కొత్తపల్లి చెరువు, చింతకుంట కెనాల్ ల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తుతోపాటు, పోలీసులకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఐపీఎస్ పేర్కొన్నారు. భాగంగా భాగంగా గణేష్ శోభాయాత్రలో డీజేల వినియోగంతోపాటు బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించారు.
అదేవిధంగా నిమజ్జనం కొరకు నిర్వహించే శోభాయాత్రలో పాల్గొనే భక్తులు ఎటువంటి ఆయుధాల ప్రదర్శన, ఇతరులను గాయపరిచే వస్తువులు ఉండవు, విద్వేషపూరిత నినాదాలు, ప్రసంగాలు చేయడం వలన పాటల వినియోగం వంటి చర్యలకు హాజరుకావడం లేదని తెలిపారు. ఇట్టి నియమాలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రజలంతా భక్తి శ్రద్ధలతో, మతసామరస్యాన్ని కాపాడుతూ ప్రశాంత వాతావరణంలో నిమ్మజ్జన కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.
Get real time update about this post category directly on your device, subscribe now.