ముద్ర, అమరావతి:రాష్ట్రంలో ప్రభుత్వం ద్వారా స్వచ్చమైన పరిపాలనా కూటమిని నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రజలకు అందించాలని సంకల్పించారని, అత్యంత కీలకమైన గనులు, భూగర్భ శాఖలు, ఎక్సైజ్‌లు తనకు కేటాయించడం ఒక గురుతర బాధ్యతగా భావిస్తున్నానని మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర అన్నారు. సమర్ధవంతంగా పని చేసి, వాటి ద్వారా రాష్ట్ర ఖజానాకు ఆదాయం చేకూర్చడానికి శాయశక్తులా కృషి చేస్తానని వెలగపూడి సచివాలయం మూడవ భవనం మొదటి అంతస్థులో కుటుంబ సభ్యులతో కలిసి వేద పండితుల మంత్రోచ్ఛారణలు, పూజా కార్యక్రమాల అనంతరం మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర మైన్స్, ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
గత 2022 వ సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉన్న ఓఎన్ జిసి చమురు అన్వేషణకు సంబంధించిన ఫైల్ పై మంత్రి తొలి సంతకం చేశారు. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ నిబంధనలు 1959 ప్రకారం షరతుల ప్రకారం 2022 నుంచి 2040 వరకు ఈ లైసెన్స్ పునరుద్ధరణ జరుగుతుంది.
రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ విధానానికి రూపకల్పన చేసి, మద్యం లావాదేవీలు, డిస్టిలరీల నుంచి పంపిణీ అత్యంత పారదర్శకంగా అమలు చేసేందుకు, అక్రమ ఇసుక రవాణాను నియంత్రించి, ప్రజావసరాల కనుగుణంగా ఇసుక సరఫరాకు చర్యలు తీసుకుంటామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
మన రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన సంపద సంపద ప్రజా శ్రేయస్సు కోసం సద్వినియోగం జరిగింది, ఈ సందర్భంగా మచిలీపట్నం నియోజకవర్గ ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజలకు శిరసాభివందనం చేస్తున్నానని మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర తెలియజేశారు జ.మైన్స్ కార్యదర్శి డా. ఎన్. యువరాజ్, డైరక్టర్ మైన్స్ శ్రీ ప్రవీణ్ కుమార్, ఇతర అధికారులు, ఉద్యోగులు మర్యాద పూర్వకంగా మంత్రిని కలిసి పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలిపారు.
Get real time update about this post category directly on your device, subscribe now.