గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఒక్కో కుటుంబానికి రూ. 25,000 – సీఎం చంద్రబాబు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – RMK News

by RMK NEWS
0 comments
గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఒక్కో కుటుంబానికి రూ. 25,000 - సీఎం చంద్రబాబు - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



2

విజయవాడ వరద బాధితులకు గుడ్ న్యూస్ అందించారు సీఎం చంద్రబాబు. వరద కారణంగా నష్టపోయిన వారికి ఒక్కో ఇంటికి రూ.25 వేలు పరిహారం రూపంలో అందించిన సీఎం నిర్ణయించారు. ఇంకా, పరిశ్రమలకు కూడా ఆర్థిక సాయం నిర్ణయించారు. వారి ఎంపికను బట్టి సాయం ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఇటీవల విజయవాడలో వరదలకు పూర్తిగా నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.25 వేలు, మొదటి అంతస్తులో ఉండేవారికి రూ.10 వేలు, ఇళ్లల్లో నీళ్లు వచ్చిన బాధితులకు రూ. 10 వేలు, చిరువ్యాపారులకు రూ. 25 వేలు అందజేస్తామని ఆయన చెప్పారు.

చేనేత కార్మికులకు రూ. 15 వేలు, మగ్గం కోల్పోయిన వారికి రూ. 25 వేలు, ఫిషింగ్‌ బోట్లకు నెట్‌ దెబ్బతిని పాక్షికంగా ధ్వంసమైతే రూ. 9 వేలు, పూర్తిగా ధ్వంసమైతే రూ. 20 వేలు అందజేస్తామని అలాగే బైకుల బీమా, మరమ్మతులకు సంబంధించి 9వేలకు పైగా క్లెయిమ్‌లు వచ్చాయని, ద్విచక్రవాహనదారులు రూ. 71 కోట్ల మేర క్లెయిమ్‌ చేయగా రూ. 6 కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. మరో 6వేల క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయని, త్రిచక్రవాహనదారులకు రూ. 10 వేలు ఆర్థికసాయం చేస్తామన్నారు. రూ. 40 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల టర్నోవర్‌లో ఉన్న ఎంఎస్‌ఎంఈలకు రూ. లక్ష, రూ. 1.5 కోట్లకు పైగా టర్నోవర్‌లో ఉన్న ఎంఎస్‌ఎంఈలకు రూ. 1.5 లక్షలు సాయం చంద్రబాబు వివరించారు.

హెక్టార్‌ వరికి రూ.25 వేలు, ఎకరాకు రూ.10 వేలు. అదే విధంగా హెక్టార్‌ పత్తికి రూ.25 వేలు, వేరుశనగకు రూ.25 వేలు, హెక్టార్‌ చెరకుకు రూ.25 వేలు, హెక్టార్‌ పొగాకుకు రూ.15 వేలు, హెక్టార్‌ మొక్కజొన్న, రాగికి రూ.15 వేలు, హెక్టార్‌ సోయాబీన్‌, పొద్దుతిరుగుడుకు, రూ.15 వేలు. , సామలకు రూ.15 వేలు అందేలా ఉన్నాయి.

పసుపు, అరటికి రూ.35 వేలు, కూరగాయలకు రూ.25 వేలు, మిరపాకు రూ.35 వేలు, బొప్పాయికి రూ.25 వేలు, టమాటకు రూ.25 వేలు, జామకు రూ.35 వేలు, పూలకు రూ.25 వేలు, ఉల్లిపాయ రూ.25 వేలు , నిమ్మకు రూ.35 వేలు, మామిడికి రూ.35 వేలు, కాఫీకి రూ.35 వేలు, పుచ్చకాయకు రూ.25 వేలు, నర్సరీకి రూ.25 వేలు, దానిమ్మకు రూ.35 వేలు, సపోటకు రూ.35 వేలు అందిస్తామన్నారు. డ్రాగన్‌ ఫూట్‌కు రూ.35 వేలు, పామాయిల్‌ చెట్టుకు రూ.1500, సీరీకల్చర్‌కు రూ.25 వేలు, కొబ్బరి చెట్టుకు రూ.1500 సాయాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పశువులకు రూ.50 వేలు, ఎద్దులకు రూ.40 వేలు సాయం అందిస్తామన్నారు. దూడలకు రూ.25 వేలు, గొర్రెలకు రూ.7500 సాయాన్ని ప్రకటించారు. కోళ్లకు రూ.100, షెడ్డు ధ్వంసమైతే రూ.5 వేలు సాయం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like