ముద్ర, ఆలేరు : ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ జన్మదినం సందర్భంగా శనివారం ఆలేరు పట్టణంలోని ప్రకాష్ గార్డెన్‌లో అభిమానులు, పార్టీ శ్రేణుల మధ్య జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముందుగా ఆయన పట్టణంలోని శ్రీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో రోగులకు పండ్ల పంపిణీ చేసి రాఘవ స్వచ్ఛంద సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, ఆలేరు మండల బిఆర్‌ఎస్ అధ్యక్షులు గంగుల శ్రీనివాస్, యాదగిరిగుట్ట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ జిల్లా సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు కర్రె వెంకటయ్య, ఆలేరు పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్ గౌడ్ తో పాటు నియోజకవర్గంలోని మాజీ ఎంపీలు, జడ్పీటీసీ సభ్యులు, తాజా మాజీ సర్పంచులు, అందరూ మండలాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు ఉన్నారు.
Get real time update about this post category directly on your device, subscribe now.