చిరంజీవి చేతిలో ఉన్న ఈ పిల్లాడు ఎవరో తెలుసా..? రామ్ చరణ్ కాదు.. – RMK News

by RMK NEWS
0 comments
చిరంజీవి చేతిలో ఉన్న ఈ పిల్లాడు ఎవరో తెలుసా..? రామ్ చరణ్ కాదు..










మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్వయం కృషితో టాలీవుడ్ టాప్ హీరోగా మారాడు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగాడు. ప్రాణం ఖరీదు నుండి విశ్వంభర వరకు 158 చిత్రాలు చేశాడు. తెలుగు ఇండస్ట్రీ వైపు ఇతర ఇండస్ట్రీలు తల తిప్పుకునేలా చేసిన నటుడు. ఫైట్స్, డ్యాన్స్‌కు కొత్త పలుకులు నేర్పాడు. ఎంతోమందికి మెగాస్టార్ ఫేవరేట్ హీరో. అప్ కమింగ్ హీరోలకు ఆయనొక ఇన్ప్సిరేషన్. ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమకు పెద్ద దిక్కుగా మారాడు. కళామతల్లికి సేవకు’గానూ దేశంలోనే రెండవ అత్యంత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌తో సత్కరించింది.

ఇదిలా ఉంటే.. ఇదిగో చిరంజీవి ఎత్తుకున్న ఈ పిల్లాడు ఎవరో గుర్తుపట్టారా.. ఆయన కుమారుడు రామ్ చరణ్ అనుకునేరు అస్సలు కాదు. ఇతడు కూడా టాలీవుడ్ హీరోనే. నటనను వారసత్వంగా తీసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఇప్పుడు టాలెంట్ యాక్టర్‌గా ఎదిగాడు. ప్రస్తుతం కొనసాగుతున్నాడు. ఇంతకు అతడు ఎవంటే.. చిరంజీవి మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ అలియాస్ సాయి దుర్గ తేజ్ (ఇటీవల పేరు మార్చుకున్నాడు). రేయ్ మూవీతో కెరీర్ స్టార్ట్ చేశాడు. కానీ అంతకన్నా ముందు పిల్లా నువ్వు లేని జీవితం మూవీతో పరిచయం అయ్యాడు. సుబ్రమణ్యం సెల్, సుప్రీం చిత్రాలతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన మూవీలు తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటెలిజెంట్, తేజ్ ఐలవ్యూ అంతగా ఆకట్టుకోలేదు.

చిత్రలహరి, ప్రతి రోజు పండుగే, సోలే బ్రతుకే సో బెటర్ ఓకే అనిపించాయి. ఆ తర్వాత వచ్చిన రిపబ్లిక్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రెండు ఏళ్లు గ్యాప్ తీసుకుని సరికొత్త కథతో వచ్చి హిట్ అందుకున్నాడు. విరూపాక్షతో మరో హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు. మరో మామయ్య.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన బ్రో మూవీ కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఓ ప్రమాదం బయటపడ్డాడు సాయి తేజ్. ఈ మార్చి ఏడాదిలో తన తల్లి పేరులో ఉన్న దుర్గను తన పేరుకు జతగా సాయి ధరమ్ తేజ్ కాస్త.. సాయి దుర్గ తేజ్‌గా మారాడు. గాజా శంకర్ అనే మూవీ ఎనౌన్స్ చేయగా.. రకరకాల కారణాలతో ఆగిపోయింది. ఇప్పుడు మరో మూవీని షురూ చేశాడు తేజ్. అలాగే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆయన విశ్వంభర చిత్రంతో గడుపుతున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకుడు. త్రిష, సురభి, మీనాక్షి చౌదరి, ఇషా చావ్వాల, ఆషికా రంగనాథ్, రావు రమేష్ వంటి స్టార్స్ ఉన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతిని బాక్సాఫీసును టార్గెట్ చేయనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి





Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like