టీటీడీ చైర్మన్‌గా బీఆర్‌ నాయుడు, నూతన పాలక మండలి ఏర్పాటు – RMK News

by RMK NEWS
0 comments
టీటీడీ చైర్మన్‌గా బీఆర్‌ నాయుడు, నూతన పాలక మండలి ఏర్పాటు


తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు చైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు నూతన పాలక మండలిని ఏర్పాటు చేస్తూ టీటీడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. చైర్మన్‌తోపాటు మొత్తం 24 మంది సభ్యులతో కూడిన టీటీడీ కొత్త పాలక మండలి ఏర్పాటు అయింది. తాజాగా ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డులో ఎమ్మెల్యేలు, కేంద్ర మాజీ మంత్రి, వ్యాపారవేత్తలు సహా పలు రంగాలకు చెందిన ప్రముఖులు దక్కించుకున్నారు. టీటీడీ చైర్మన్‌గా నియమితులైన బీఆర్‌ నాయుడు వ్యాపారవేత్తగా, మీడియా సంస్థ అధినేతగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే. టీవీ-5 మీడియా సంస్థకు ఈయనే అధినేత. తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన మీడియాలో ఈ ఛానల్ ముందు వరుసలో ఉంటుంది.

టీటీడీ బోర్డు సభ్యులగా నియమితులైన వారిలో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, మడకరశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు, సాంబశివరావు(జాస్తిశివ), కృష్ణమూర్తి, శ్రీ సదాశివ నన్నపనేని, కోటేశ్వరరావు, మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌, జంగా కృష్ణమూర్తి, తారా’ పి రామ్మూర్తి, జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్‌, జానకీదేవి తమ్మిశెట్టి, అనుగోలు రంగశ్రీ(తెలంగాణ), బుంగనూరు మహేందర్‌ రెడ్డి(తెలంగాణ), సుచిత్ర ఎల్లా(తెలంగాణ), నరేశ్‌ కుమార్‌, డాక్టర్‌ ఆదిత్‌ దేశాయ్‌, సౌరబ్‌ హెచ్‌ బోరా పాలక మండలి సభ్యులుగా నియమితులయ్యారు. నూతన బోర్డు నియామకానికి సంబంధించి టీటీడీ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఇదిలా ఉంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారు చేసే లడ్డూలో కల్తీ జరిగిందంటూ పెద్ద ఎత్తున వివాదం జరిగిన తరువాత నూతన బోర్డు ఏర్పాటు కాబోతోంది.

మహారాష్ట్రలో తేలిన నామినేషన్ల లెక్క.. ఎంతమంది వేశారంటే.!
చర్లపల్లి రైల్వే స్టేషన్ | ఎయిర్‌పోర్టులను తలపించేలా చర్లపల్లి రైల్వే స్టేషన్

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like