తిరుపతిలో వర్షాలు.. ఆ దర్శనాలపై నిర్ణయం తీసుకున్న టిటిడి – RMK News

by RMK NEWS
0 comments
తిరుపతిలో వర్షాలు.. ఆ దర్శనాలపై నిర్ణయం తీసుకున్న టిటిడి


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతిలో కూడా మూడు రోజులపాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి కాకుండా దేశంలోని అనేక చోట్ల నుంచి భక్తులు భారీగా స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. అటువంటి వారంతా ఆలయానికి ఇబ్బందులు పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో వర్షాలు నేపథ్యంలో టీటీడీ అధికారులు ముందుగానే కీలక ప్రకటన విడుదల చేశారు. శ్రీవారి బ్రేక్ దర్శనానికి అధిక డిమాండ్ ఉన్న నేపథ్యంలో భక్తులు శ్రీవారి దర్శనానికి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేలా ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అక్టోబర్ 16వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో వైసిపి బ్రేక్ దర్శనాలను టీటీడీ అధికారులు రద్దు చేశారు. ఈ నేపథ్యంలో బ్రేక్ దర్శనాలకు సంబంధించిన ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించకూడదని నిర్ణయించింది. ఈ సందర్భంగా భక్తులు గమనించాలని టిటిడి అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తిరుపతికి భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈవో శ్యామలరావు ఇప్పటికే ఒక ప్రకటనలో అధికారులను స్వాధీనం చేసుకున్నారు. విపత్తు నిర్వహణ ప్రణాళికపై టీటీడీ అడిషనల్ ఈవో సీపీ వెంకయ్య చౌదరితో కలిసి ఆయన అధికారులతో సమావేశాన్ని నిర్వహించి స్పష్టమైన ప్రకటనను అందించారు. వర్షాలు నేపథ్యంలో విఐపి బ్రేక్ దర్శనానికి సంబంధించి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజలు, అవగాహన ఉండాలని భక్తులు ఇక్కడికి వచ్చి ఇబ్బందులకు గురికావద్దని ఆయన సూచించారు.

ఇదిలా ఉంటే 48 గంటల్లో తిరుమలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు నేపథ్యంలో విపరీతమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని టిటిడి అధికారులు ప్రకటించారు. ఈ ప్రణాళిక బాగుందని, మరింత అవసరం ఉందని అధికారులకు సూచించారు. వాటి ప్రణాళిక ప్రకారం ప్రస్తుతం విపత్తు నిర్వహణకు టీటీడీ అధికారులు సిద్ధమవుతున్నారు. కొండ చరియలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచనలు జారీ చేశారు. విద్యుత్‌కు అంతరాయం కలుగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్ శాఖ అంతరాయాల్లో జనరేటర్ నడపడానికి ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా తగినంత డీజిల్ అందుబాటులో ఉంచాలని సూచించారు. భక్తులకు వసతి, దర్శనం, ప్రసాదాలు పంపిణీ కార్యకలాపాలకు ఆటంకం కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఉన్నాయి. విపత్కర పరిస్థితులు ఎదుర్కొనే చర్యల్లో భాగంగా వైద్యశాఖ అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచుకుని అప్రమత్తంగా ఉండనుంది. ఇంజనీరింగ్ విభాగం డ్యామ్ గేట్లను దగ్గరగా ఉంటుంది. ఘాట్ రోడ్లలో జెసిబి ట్రక్కులు, ట్రాక్టర్లు తగిన సిబ్బందిని సంసిద్ధంగా ఉంచింది. ట్రాఫిక్ పోలీసులు ఇంజనీరింగ్ సిబ్బందితో సమన్వయం చేసుకొని పని చేయడానికి ఆదేశాలు జారీ చేయబడ్డాయి. విపత్కర పరిస్థితి ఎదురైతే అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించేలా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రజా విభాగం వాతావరణ సమాచారం భక్తులను తెలుసుకుంటూ ఎస్విబిసి, టిటిడి సోషల్ మీడియా ద్వారా మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తూ అప్రమత్తం చేయనున్నారు.

తెలంగాణలో క్యాబినెట్ విస్తరణ జరిగేనా.. మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళుతున్న సీఎం రేవంత్ రెడ్డి
భూమ్మీద అత్యంత అనారోగ్యకర ఆహార పదార్థాలు ఇవే..

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like