దర్శన్ కేసులో సంచలన నిజాలు బయటకి! 40 లక్షలు సుపారీ ఇచ్చిన వ్యక్తి అదృశ్యం! – RMK News

by RMK NEWS
0 comments
 దర్శన్ కేసులో సంచలన నిజాలు బయటకి!  40 లక్షలు సుపారీ ఇచ్చిన వ్యక్తి అదృశ్యం!










ప్రియురాలికి అసభ్యకర సందేశాలు, వీడియోలు పంపాడన్న ఆరోపణలపై కన్నడ స్టార్ నటుడు దర్శన్ తూగదీప.. సొంత అభిమాని రేణుకా స్వామిని హత్య చేసిన సంగతి విదితమే. ఈ కేసులో ఇప్పటి వరకు 17 మంది అరెస్టు అయ్యారు. దర్శనంతో పాటు ఆరుగురు నిందితులకు పోలీస్ కస్టడీ పొడిగించింది ట్రయల్ కోర్టు. అలాగే పవిత్ర గౌడతో మిగిలిన నిందితులకు జ్యూడీషియల్ కస్టడీకి పంపింది.వీరిని బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. ఇదిలా ఉంటే.రేణుకా స్వామిని హత్య చేసేందుకు దర్శనం.. రూ. 30 లక్షలు సుపారీ ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే ఈ డబ్బులను దర్శన్ మరో వ్యక్తి తీసుకున్నట్లు పేర్కొన్నారు. అతడ్ని విచారించేందుకు ప్రయత్నించగా.. పరారీలో ఉన్నట్లు తేలింది.

రేణుకా స్వామి హత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. కొత్త కొత్త కోణాలు.. కొత్త ముఖాలు ఎంట్రీ ఇస్తున్నాయి. తాజాగా మరో పేరు వినిపించింది. దర్శనం సుపారీకి ఇచ్చిన డబ్బులు మరొకరి నుండి తీసుకున్నట్లు గుర్తించాడు. రూ. 40 లక్షలు తీసుకుని.. రేణుకా స్వామిని హత్య చేసినట్లు పేర్కొన్నారు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరంటే.. మోహన్ రాజ్. ఇతడు మాజీ కార్పొరేటర్, దర్శన్‌కు బాగా కావాల్సిన వ్యక్తి. దర్శన్‌కు అత్యంత సన్నిహితుడు, స్నేహితుడైన మోహన్ రాజ్ ఈ డబ్బులు ఎరెంజ్ చేశాడట. తన పేరు ఎక్కడ వినిపించొద్దని కోరాడట. అయితే ఈ డబ్బు అందించిన సమయంలో మోహన్‌రాజ్‌కి ఈ హత్య విషయం తెలిసిందా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్న. అది తెలిస్తే హత్య కేసు మోహన్ రాజ్ మెడకు కూడా చుట్టుకోనుంది.

అభిమాని హత్య కేసులో మరొకరు ప్రమేయాన్ని పసిగట్టిన పోలీసులు.. దర్శన్ సుపారీ మాట్లాడటానికి లక్షలు ఇచ్చినట్లు తేలింది. విచారణ చేయగా.. నిందితులు మోహన్ రాజ్ పేరు తెలియజేశారు. అలా అతడి పేరు బయటకు వచ్చింది. పోలీసులు అతడ్ని విచారించేందుకు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని వచ్చింది. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్లు తేలింది. అయితే ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో కామాక్షి పాళ్య పోలీసులు ఇంటికి వెళ్లి నోటీసులివ్వాలని నిర్ణయించుకున్నారు. కాగా, మోహన్ రాజ్.. 2019లో బెంగళూరు డిప్యూటీ మేయర్‌గా వ్యవహరించారు. బొమ్మనహళ్లి వార్డు కార్పొరేటర్‌. కాగా, గతంలో మోహన్ రాజ్ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. భూమి విషయంలో తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ బొమ్మనహళ్లి సమీపంలోని ఓ ఫాంహౌస్‌లో పోలీసుల ఎదుటే ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి





Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like