పట్టభద్రుల కోసం ఉద్యోగాన్ని త్యాగం చేశా… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – RMK News

by RMK NEWS
0 comments
పట్టభద్రుల కోసం ఉద్యోగాన్ని త్యాగం చేశా... - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • స్ఫూర్తివంతమైన రాజకీయాల కోసం కృషి చేస్తా
  • విలక్షణ ఆలోచనలతో రాజకీయ ప్రక్షాళనకు ప్రయత్నించా
  • అవకాశం ఇవ్వండి గుణాత్మక మార్పు తీసుకువస్తా
  • పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :పట్టభద్రుల జీవన ప్రమాణాలు ప్రమాణాలు లక్ష్యంగా ఉద్యోగాన్ని త్యాగం చేశానని ఎమ్మెల్సీగా నాకు అవకాశం ఇస్తే రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకు వస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ.

3

నిరుద్యోగ సమాజం కోసం రానున్న కరీంనగర్ అదిలాబాద్, నిజామాబాదు మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ప్రతినిధి మండలిలో అడుగుపెడితే వారి సమస్యల హక్కుల కోసం వారి వాణిని మరింత సమర్థవంతంగా ప్రతిధ్వనించవచ్చునన్న దృఢ సంకల్పంతో ఎమ్మెల్సీ బరిలో నిలుస్తున్నట్లు తెలిపారు. గ్రాడ్యుయేట్స్ కోసం నాకున్న 19 సంవత్సరాల సర్వీసును త్యాగం చేయడానికి సిద్ధపడ్డానని, గజ్వేల్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఉద్యోగానికి రాజీనామా చేశానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నన్ను వెనకుండి నడిపిస్తున్న మిత్రులు, సహా అధ్యాపకులు కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

4

అసిస్టెంట్ ప్రొఫెసర్ గజ్వేల్ మహిళా డిగ్రీ కళాశాలకు రాజీనామా సమర్పించిన ప్రభుత్వ అనంతరం కరీంనగర్ బయలుదేరారు. జాతీయ రహదారిలోని రేణిగుంట టోల్గేట్ వద్ద పెద్ద ఎత్తున వాహనాలతో పట్టభద్రులు వివిధ సంఘాల నాయకులు ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున వందల వాహనాలతో ర్యాలీగా కరీంనగర్ పట్టణంలో బయలుదేరారు. తెలంగాణ చౌరస్తా లో భారీ సంఖ్యలో అభిమానులతో ఒగ్గుడోలు డప్పు కళాకారుల వాయిద్యాల నడుమ పద్మనాయక కళ్యాణ మండపం చేరుకున్నారు.

అనంతరం సభను ఉద్దేశించి ముఖ్య అతిథి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ శాసనమండలి చరిత్రలో తొలిసారిగా పట్టభద్రులవేత్త పట్టభద్రుల నుంచి ఒక విద్యార్ధి అయినటువంటి ప్రసన్న హరికృష్ణ బరిలోకి దిగడం అత్యంత అభినందనీయం అని తెలిపారు. విద్యను వ్యాపారమయం చేసి రాజకీయ ఉద్యోగం కోసం పాకులాడే వ్యక్తులు ఒకవైపు ఉండగా అదే విద్య కోసం విద్యలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడం కోసం ఉన్న ఉద్యోగాన్ని త్యాగం చేసేటువంటి వ్యక్తి మరో వైపు ఉన్నాడు కాబట్టి విజ్ఞులైన పట్టభద్రులు జాగ్రత్తగా ఆలోచించి ఓటు అనే వజ్రాయుధం ద్వారా ఒక కొత్త తరం రాజకీయానికి నాంది కావాలని కోరుతున్నారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఇంతకాలం వరకు పట్టభద్రుల గురించి మాట్లాడుతూ వారి సమస్యల పట్ల స్పందించిన నాయకుడు మండలిలో కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే వాళ్లు ఫక్తు రాజకీయని, కానీ ఒక విద్యావేత్తగా ఒక ఉన్నత ఉద్యోగిగా అటు పట్టభద్రులకు ఇటు నాయకుల సమస్యల పట్ల సంపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తిగా వారి వాణి బాణీని శాసనమండలి వేదికగా బలంగా వినిపిస్తున్నట్లు స్పష్టం చేశారు. వారి సమస్యల పట్ల ప్రశ్నించడమే కాకుండా ఒక ప్రత్యామ్నాయ, పరిష్కార మార్గాలను కూడా వెతికే అవగాహన కలిగిన వ్యక్తిగా వారి వెన్నంటి నిలబడతానని ఈ వేదికగా హామీ ఇస్తున్నట్లు తెలిపారు. తన గెలుపు రాబోయే తరం సమాజంలో యువత గుణాత్మకమైన మార్పు కోసం పరివర్తన కోసం తపిస్తూ రాజకీయంలోకి రావాలనుకునే ఒక మార్గ నిర్దేశకంగా మారుతుందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధమని దానిని ఉపయోగించి భవిష్యత్తు రాజకీయాలకు నిలవాలని అందుకోసం ప్రతి ఒక్క పట్టభద్రుడు తప్పనిసరిగా తన ఓటును నమోదు చేసుకోవాలని సాక్షి.

కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె సురేందర్ రెడ్డి తెలంగాణ జూనియర్ కళాశాల అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ , గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్ , టీఎన్జీవో కళాశాల విద్య నాన్ టీచింగ్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు అసంపల్లి నాగరాజు, ఎస్ ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె రామకృష్ణ, బీసీ సంఘాల రాష్ట్ర నాయకులు, ఉద్యోగ సంఘాల నేతలు రిటైర్డ్ ఉద్యోగ సంఘాల నేతలు మరియు ఓయూ విద్యార్థులు పట్టబద్రులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like