- 14 తులాల బంగారం చోరీ
- బాధితులు జగిత్యాల జిల్లా వాసులుగా గుర్తింపు
పెబ్బేరు :వనపర్తి జిల్లా పెబ్బేరు శివారులోని పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా ఉన్న మూత్రశాలల వద్ద ఆగి ఉన్న వాహనంపై గుర్తు తెలియని దుండగులు కత్తులు, రాళ్లతో దాడి చేసి 14 తులాల బంగారు చోరీ చేసి దారి దోపిడీ చేశారు. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా ఇబ్రహీపట్నం మండలం కూజన్ కొత్తూరు గ్రామానికి చెందిన 3 కుటుంబాలకు చెందిన 8 మంది తిరుపతి, అరుణాచలం తదితర తీర్ధయాత్రలకు వెళ్లి తిరిగివస్తూ అలసిపోగా నిద్రపోదామని పెబ్బేరు శివారులోని పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా ఉన్న భారీ వాహనాలు నిలిచిపోయాయి. అర్ధరాత్రి సమయంలో కొందరు దుండగులు అకస్మాత్తుగా కత్తులు, రాళ్లతో దాడి చేసి వెహికిల్లో ఉన్న 8 మంది వద్ద 14 తులాల బంగారు చోరీ చేశారు. వెహికిల్ టాప్ పైన ఉన్నా బ్యాగులను ఎత్తుకెళ్లారు. బండిలో ఉన్న మగవారు దుండగులపై ప్రతి దాడి చేయగా వారిపై రాళ్ళతో కొట్టారు.
తెల్లవారుజామున 3:30 గంటలకు ఘటన జరిగింది. వెంటనే బాధితులు 100 కు డయల్ చేయగా స్పందించిన పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ముగ్గురు తీవ్రంగా గాయపడగా మహిళలకు మెడలపై ఘాట్లు పడి స్వల్పంగా గాయపడ్డారు. 108 వాహనంలో వనపర్తి జిల్లా ఆసుపత్రికి చేరుకున్నారు. ఘటన వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ పరిశీలించారు. వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్ రావు, సీఐ రాంబాబు, ఎస్సై హరిప్రసాద్ రెడ్డి ఘటనపై విచారణ జరిపారు. క్లూస్ టీమ్ వారు రక్తపు మరకలు, వేలిముద్రలు వంటి వివరాలను సేకరించారు.
Get real time update about this post category directly on your device, subscribe now.