ప్రలోభాలకు లొంగ వద్దు.. ఎమ్మెల్సీలకు వైసీపీ అధినేత జగన్ సూచన – RMK News

by RMK NEWS
0 comments
ప్రలోభాలకు లొంగ వద్దు.. ఎమ్మెల్సీలకు వైసీపీ అధినేత జగన్ సూచన


సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభావం తర్వాత వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓటమికి గల కారణాలపై విశ్లేషిస్తున్నారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో దఫదఫాలుగా సమావేశం అవుతున్నారు. తాజాగా గురువారం ఎమ్మెల్సీలతో సమావేశమైన జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా వారికి కీలక సూచనలు చేశారు. ఎమ్మెల్సీలు ప్రలోభాలకు లోను కాకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని ఆయన సూచించారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, కూటమిగా వాళ్లు వచ్చిన మనకు 40 శాతం ఓటు బ్యాంకు ఉందన్న పరిశీలన గుర్తించాలని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. 2029 ఎన్నికల నాటికి పార్టీని మరింత పటిష్టం చేసి అధికారంలోకి వద్దామని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీలకు భరోసా ఇచ్చారు. నాయకులు ధైర్యంగా ప్రజల మధ్య ఉండాలన్నారు. కేసులు పెట్టినా భయపడకుండా, ప్రలోభాలకు లొంగకుండా ఎమ్మెల్సీలు ముందుకు సాగాలన్నారు. ఐదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలు గుర్తించారని, ఎన్నికల ఫలితాలు శకుని పాచికలు ఉన్నాయని తెలిపారు. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. టిడిపి బిజెపి జనసేన హనీమూన్ నడుస్తోందని, ఈ ప్రభుత్వానికి మరికొంత సమయం ఇద్దామని. ఆ తరువాత ప్రజా సమస్యలపై పోరాటాన్ని సాగిద్దామని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో తమ నోళ్లను కట్టడి చేసే అవకాశం లేదని, అయితే మండలిలో ప్రజా గళాన్ని వినిపించామని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీలకు సూచించారు. శాసన మండలిలో ప్రభావం చూపించాల్సిన అవసరం ఉందని జగన్ ఎమ్మెల్సీలకు తెలియజేశారు. ఈ సందర్భంగా మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపైన దిశ, నిర్ణయం చేశారు జగన్. కొద్ది రోజుల్లోనే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజలతోనే మమేకమవుతామని జగన్ స్పష్టం చేశారు. 2029లో కచ్చితంగా అధికారంలోకి వస్తామని ధైర్యంగా ఉండాలని ఈ సందర్భంగా జగన్ ఎమ్మెల్సీలకు భరోసా కల్పించారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like