బ్రేక్ కాదు… గ్యాప్ … చెరువుల ఆక్రమణల కూల్చివేత ఆగదు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – RMK News

by RMK NEWS
0 comments
బ్రేక్ కాదు... గ్యాప్ ... చెరువుల ఆక్రమణల కూల్చివేత ఆగదు - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • పరిశీలన కోసం తాత్కాలికంగా గ్యాప్ తీసుకున్నాం
  • ఇప్పటికే జియో ఫెన్సింగ్ చర్యలు
  • హైడ్రాకు డాప్లర్ రాడార్ ను సమకూర్చండి
  • కొత్తగా ప్లాట్లు కొనేవారు జాగ్రత్త
  • అధికారికమైన, అనాధికారమైన గతంలో నిర్మించిన ఇండ్ల జోలికి వెళ్ళాం
  • 200 ఎకరాల భూమిని కాపాడడం
  • వార్షిక నివేదికను విడుదల చేసిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

ముద్ర, తెలంగాణ బ్యూరో : అక్రమ నిర్మాణాల తొలగింపులకు బ్రేక్ ఇవ్వలేదని, పరిశీలన కోసం తాత్కాలికంగా గ్యాప్ తీసుకున్నామని హైడ్రా కమిషనర్ ఏపీ రంగనాథ్ తెలిపారు. ఈ మేరకు శనివారం హైడ్రా వార్షిక నివేదికను కమిషనర్ రంగనాథ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైడ్రా ఏర్పడి ఇప్పటికి 5 నెలల కాలం దాటిందని, ఈ అనుభవంతో వచ్చే ఏడాది రూట్ మ్యాప్ సిద్ధం చేశామన్నారు. ఔటర్ రింగ్ రోడ్ వరకు హైడ్రా పరిధి ఉందని, జీహెచ్‌సీ చట్టం కింద ప్రభుత్వం ప్రత్యేక అధికారాలను ఇచ్చింది. వచ్చే ఏడాది నుంచి ప్రతి సోమవారం గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

2

ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరిస్తామని ఆయన అన్నారు. పన్నెండు చెరువులు, ఎనిమిది పార్కులు అన్యాక్రాంతం కాకుండా కాపాడటమే కాకుండా 200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించామన్నారు. ఇప్పటికే ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ పై ప్రజల్లో అవగాహన పెరిగింది. 1095 చెరువుల్లో వచ్చే ఏడాది ఎఫ్ టీఎల్ నిర్ధారణ చేస్తామన్నారు. ఎఫ్ టీఎల్ ను పారదర్శకంగా చేయడమే తమ బాధ్యత అని, సాంకేతిక పరిజ్ఞానం , డాటాతో ఎఫ్ టీఎల్ నిర్ధారణ చేస్తామన్నారు. 2006 నుంచి 2023 వరకు ఏరియల్ డ్రోన్లతో తీసిన పరిశీలన కూడా ఎఫ్ టీఎల్ నిర్ధారణ కోసం తీసుకుంటామని అన్నారు. ఎఫ్ టీఎల్ మారడానికి గల కారణాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. శాస్త్రీయ పద్దతుల్లోనే ఎఫ్ టీఎల్ నిర్ధారణ జరుగుతుందని, నాలాలపై కిర్లోస్కర్ కంపెనీ చేసిన స్టడీని తీసుకుంటామన్నారు. అనధికారిక నిర్మాణాలకు సంబంధించి హైదరాబాద్ చుట్టూ ఉన్న 27 పురపాలక సంఘాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. 27 పురపాలక సంఘాలపై కూడా వారి అధికారం. శాటిలైట్ ఇమేజ్ ల ద్వారా ఆక్రమణలను గుర్తిస్తున్నామని కమిషనర్ రంగనాథ్ చెప్పారు.

భవన నిర్మాణ వ్యర్థాల డంపింగ్ పై కూడా దృష్టి సారించామన్నారు. 2025లో జియో ఫెన్సింగ్ సర్వే చేస్తామన్నారు. 12 చెరువుల పునరుద్ధరణకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపబడ్డాయి. త్వరలోనే 72 డీఆర్ఎఫ్ బృందాలు అక్కడకు వస్తాయన్నారు. నాగోల్‌లో ఉన్న డీఆర్‌ఎఫ్ కేంద్రాన్ని మెరుగుపరుస్తుంది, త్వరలో నగరంలో మరో డాప్లర్ రాబోతు ఉంది. వెదర్ డాటాను తెలుసుకోవడానికి హైడ్రాలో ఒక టీంను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. హైడ్రా తరపున ఒక ఎఫ్‌ఎం ఛానల్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. హైడ్రా వల్ల ప్రజల్లో భూములు, ఇల్లు క్రయక్రయాలపై అవగాహన పెరుగుతుండడంతో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కఠినంగానే ఉంటుందన్న కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. జూలై తర్వాత అనధికారికంగా, వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేవారిపై చర్యలు తప్పవన్నారు. ఎఫ్‌టీఎల్‌లో ఉన్న షెడ్లపై ప్రజలెవరు అద్దెకు తీసుకోలేదు. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరిస్తున్నామని రంగనాథ్

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like