కాంగ్రెస్ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతు రుణ మాఫీ ఎగ్గొట్టి, మూసి లో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. “రైతు బంధు ఎగ్గొట్టి, మూసి పేదల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరు?.. మహిళలకు వంద రోజుల్లోనే నెలకు 2500 ఇస్తానని చెప్పి తప్పించుకు తిరుగుతున్న మోసగాడు ఎవరు?.. అవ్వ, తాతలకు నెలకు 4000 ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టిన నయవంచకుడు ఎవరు?.. అని ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తా. తప్పిన దగావీరుడు ఎవరు? .. మూసి బ్యూటిఫికేషన్ పేరుతో 1,500,000,000 కోట్ల లూటిఫికేషన్ కి తెరతీసిన ఘనుడు ఎవరు? ” అంటూ కేటీఆర్ నిలదీశారు.
మూసి వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు?
✳️ రైతు రుణ మాఫీ ఎగ్గొట్టి, మూసి లో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరు?
✳️ రైతు బంధు ఎగ్గొట్టి, మూసి పేదల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరు?
✳️ మహిళలకు వంద రోజుల్లోనే నెలకు 2500 ఇస్తా అని చెప్పి తప్పించుకు తిరుగుతున్న మోసగాడు…
— కేటీఆర్ (@KTRBRS) అక్టోబర్ 5, 2024
Get real time update about this post category directly on your device, subscribe now.