ముద్ర,సెంట్రల్ డెస్క్:-భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ రాంచీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్ వద్దకు వచ్చిన ధోనీ అక్కడ తన అమూల్యమైన ఓటు వేయబడింది. దీంతో పోలీసుల భద్రత మధ్య ధోనీ పోలింగ్‌కు వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
మరోవైపు దేశంలోని 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో 58 లోక్‌సభ నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్ జరుగుతోంది. ఈ దశలో మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. దీంతో ప్రజలతోపాటు ప్రముఖులు సైతం పెద్ద ఎత్తున ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు.
#చూడండి | జార్ఖండ్: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఆరో విడతలో ఓటు వేయడానికి రాంచీలోని పోలింగ్ స్టేషన్‌కు చేరుకున్నాడు. #లోక్‌సభ ఎన్నికలు 2024 pic.twitter.com/W5QQsIu90C
– ANI (@ANI) మే 25, 2024
Get real time update about this post category directly on your device, subscribe now.