రాత్రి నుంచి ఉద్రిక్తత … కేటీఆర్ చుట్టూ కార్యకర్తల టీం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – RMK News

by RMK NEWS
0 comments
రాత్రి నుంచి ఉద్రిక్తత ... కేటీఆర్ చుట్టూ కార్యకర్తల టీం - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



2

  • బుధవారం సాయంత్రం నుంచే ఆయన ఇంటి దగ్గర మకం
  • రాత్రి నుంచి ఉదయం వరకు జాగారం
  • ఉదయం నుంచి తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత
  • భారీగా చేరుకున్న గులాబీ బలం
  • సాయంత్రం వరకు ఏం జరుగుతుందనే ఉత్కంఠ
  • రెండో రోజు కూడా కేటీఆర్ వెంట బీఆర్ఎస్ బృందం

ముద్ర, తెలంగాణ బ్యూరో :- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతుండడంతో……రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంఠ. ఎప్పుడు…ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో కేసీఆర్ చూట్టూ బీఆర్ఎస్ శ్రేణుల కార్యకర్తల టీం రక్షణగా ఉంటుంది. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం నుంచే ఆయన ఇంటి దగ్గర పార్టీ నేతలు, కార్యకర్తలు మకాం పెట్టారు. రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు జాగారం చేశారు. ఆయనను పోలీసులు అరెస్టు చేయడానికి వస్తే….ఎలాంటి ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. దీంతో గురవారం నుంచే తెలంగాణ భవనానికి పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. దీంతో తెరచాటన ఏదో జరుగుతోందన్న ఆందోళన వారిలో ఉంది.

కాగా మూడు రోజుల క్రితం లగచర్లలో కలెక్టర్ పై దాడి ఘటనలో కేటీఆర్ అరెస్టుకు అధికారులు పక్కాగా రంగం సిద్ధం చేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో కేటీఆర్‌ను అరెస్టు ఉండొచ్చన్న ప్రచారం సాగుతోంది. అలాగే ఫార్ములా-ఈ రేసులో అవకతవకల వ్యవహారంలో కేటీఆర్ అరెస్ట్ ఉంటుందన్న ప్రచారం కొన్ని రోజులుగా సాగుతోంది. అయితే కేటీఆర్‌గా ఉన్న సమయంలో ఈ అంశంపై ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి అయిన ప్రభుత్వం గవర్నర్‌కు లేఖ రాసింది. అయితే.. రాసి 15 రోజులైనా లేఖ గవర్నర్ నుంచి ప్రభుత్వానికి అనుమతి రాలేదు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నేతలు బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. ఆ రెండు పార్టీల కుమ్మక్కు కారణంగానే బీఆర్ఎస్, బీజేపీ పెద్దల ద్వారా గవర్నర్ పై ఒత్తిడి తెస్తోందంటూ ఆరోపిస్తున్నారు. అయితే కలెక్టర్ పై దాడి కేసులో అనుమతి అవసరం లేదు. కేవలం స్పీకర్ కు సమాచారం ఇస్తే సరిపోతుంది. దీంతో ఏ క్షణమైనా కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.మరోవైపు తన అరెస్ట్ వార్తలపై కేటీఆర్ గురువారం ఉదయం స్పందించారు. తనను ఒక కేసులో రేవంత్ రెడ్డి ఇరికించి అరెస్ట్ చేస్తాడని ఎప్పుడో తెలుసు. రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా జైలుకు పోతానన్నారు. రేవంత్ కుట్రలకు భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరన్నారు.

కేటీఆర్ ఇంటి వద్ద హైటెన్షన్…

కేటీఆర్ ఇంటి దగ్గర అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం. కొడంగల్ దాడి కేసు రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు రావడంతో ఆయనను ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జోరుగా సాగింది. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాద్ లోని కేటీఆర్ నివాసానికి భారీగా తరలి వచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ తదితర పార్టీ ముఖ్యనేతలు కూడా కేటీఆర్ కు మద్దతుగా ఆయన ఇంటికి వచ్చారు.పోలీసులు ఎప్పుడు వస్తారో తెలియక రాత్రంతా కేటీఆర్ ఇంటి ముందు కాపలా కాస్తూ జాగారం చేశారు. తన కోసం తరలి వచ్చిన నేతలకు, కార్యకర్తలకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని.. ఇలాంటివి ఉద్యమం సమయంలో చాలా చూశామని కేటీఆర్ అన్నారు. ఈ అరెస్టులకు భయపడే వాళ్ళం కాదని.. ప్రభుత్వం ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. కాగా కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం నిజమవుతుందా? లేదా అనేది వేచి చూడాలి

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like