రైతు సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – RMK News

by RMK NEWS
0 comments
రైతు సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారు - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • రైతు సంక్షేమం కోసమే రైతు సంక్షేమ కమీషన్ ఏర్పాటు
  • రైతు సంక్షేమ కమీషన్ నెంబర్ గా రైతుల అభివృద్ధి కోసం కృషి చేస్తా
  • రాష్ట్ర రైతు సంక్షేమ సంఘం సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్
  • రాష్ట్ర రైతు కమీషన్ గా ఎన్నికైన చెవిటి వెంకన్న యాదవ్ ను పెద్ద ఎత్తున సన్మానిస్తున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, అభిమానులు

3

తుంగతుర్తి ముద్ర :- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొస్తున్నారని అందులో భాగంగానే దేశంలో మరెక్కడా లేనివిధంగా రాష్ట్ర రైతు సంక్షేమ కమీషన్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర రైతు సంక్షేమ కమీషన్ మెంబర్ చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర రైతు సంక్షేమ కమీషన్ ద్వారా రైతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అన్నారు.

4

మరే ఇతర రాష్ట్రంలో లేని రైతు సంక్షేమ కమీషన్‌ను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసి రైతుల అభివృద్ధి కోసం పాటుపడాలని ముఖ్యమంత్రి ఆలోచన విధానానికి కట్టుబడి తామంతా రైతు సంక్షేమానికి కృషి చేశామన్నారు .నూతనంగా ఏర్పాటైన కమీషన్‌కు పూర్తి స్థాయిలో విధివిధానాలు ఏర్పాటు చేయాలన్నారు. గత పాలకుల కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమంపై దృష్టి పెట్టిందని అన్నారు. తనను రైతు సంక్షేమ కమీషన్ మెంబర్‌గా ఎంపిక చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మిగిలిన కాంగ్రెస్ పెద్దలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా రైతు సంక్షేమ కమీషన్ మెంబర్‌గా ఎంపికైన చెవిటి వెంకన్న యాదవ్‌ను ఆయన అభిమానులు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు గత రెండు రోజులుగా శాలువాలతో ఘనంగా సన్మానిస్తున్నారు.

తుంగతుర్తి పిఎస్‌ఎస్‌ రైతు కమీషన్‌ ఛైర్మన్‌ ఘనంగా సన్మానించారు

మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని పీఎస్‌ఎస్‌ డీసీసీబీ మెంబర్‌ విండో చైర్మన్‌ గుడిపాటి సైదులు ఆధ్వర్యంలో రైతు సంక్షేమ సంఘం సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పిఎస్‌ఎస్ సభ్యులు సిబ్బంది ఉన్నారు. అనంతరం ఉపాధి హామీ జరిగిన జిల్లా భూగర్భ జలవనరుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా కార్యక్రమం .ఈ సందర్భంగా ఉపాధి హామీ కార్యాలయ సిబ్బంది చెవిటి వెంకన్న యాదవ్ ఘనంగా సన్మానించారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like