ముద్ర,సెంట్రల్ డెస్క్:-సెల్ఫీల కోసం యత్నించి యువత తమ ప్రాణాలను కోల్పోతున్నారు. డేంజర్ జోన్‌లో సెల్పీల కోసం ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రోజుకు పెరుగుతోంది. తాజాగా మెసికోలోని హిడాల్గో ఫేమస్ అయిన ఆవిరి ఇంజిన్‌లో నడిచే రైలు వస్తున్న సమయంలో రైలుకు దగ్గరగా సెల్ఫీ దిగడానికి యత్నించిన ఓ యువతిని రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. మీడియా కథనాల ప్రకారం.. రైలు ప్రమాదంలో చిక్కుకున్న మహిళ తన కుమారుడు చదువుకునే పాఠశాలకు సమీపంలో ట్రైన్ ఉంది. ఆ ట్రాక్ పై 1930లో నిర్మించిన ‘ఎంప్రెస్’ అని పిలవబడే స్టీమ్ రైలు ప్రయాణిస్తోంది. ఈ ట్రైన్ ప్రయాణిస్తున్న ప్రాంతాల ప్రజలు గుమిగూడి ఆ రైలుతో ఫోటోలు, సెల్పీలు, వీడియోలు తీసుకునేందుకు ఎగబడుతున్నారు.
ఈ విధంగానే హిడాల్గో సమీపంలో ఈ స్టీమ్ రైలును చూసేందుకు అనేక మంది తరలి రాగా తన కుమారుడితో పాటు మృతి చెందిన మహిళ కూడా వచ్చారు. అయితే అత్యుత్సాహంతో ఆమె ట్రాక్ దగ్గర నిలబడి ట్రైన్ తో సెల్పీ తీసుకునేందుకు ప్రయత్నించింది. వెనుక వైపు నుంచి వేగంగా దూసుకువచ్చిన ట్రైన్ ఆమెను ఢీకొట్టింది. మహిళ తల రైలు బలంగా ఢీ కొట్టింది. దీంతో రెప్పపాటులో ఆ మహిళ కుప్పకూలి పోయింది. అందరూ చూస్తుండగానే ప్రాణాలు విడిచింది. అప్పటి వరకు అక్కడ ఉన్న ఉల్లాసభరిత వాతావరణం ఒక్కసారిగా విషాదంగా మారింది. కళ్ల ముందే యువతి ప్రాణాలు కోల్పోవడంతో అంతా విషాదంలో మునిగిపోయారు.
రైలుతో సెల్ఫీకి యత్నించి.. దుర్మరణం
మెక్సికోలోని హిడాల్గోలోని ఫేమస్ అయిన ఆవిరి ఇంజిన్తో నడిచే రైలు వస్తున్న సమయంలో రైలుకు దగ్గరగా వెళ్లి సెల్ఫీ దిగడానికి యత్నించిన ఓ యువతిని రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. pic.twitter.com/0RQcIecRyo
— తెలుగు స్క్రైబ్ (@TeluguScribe) జూన్ 6, 2024
Get real time update about this post category directly on your device, subscribe now.