దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) కీలక ప్రకటన చేసింది. తమ సంస్థకు చెందిన సిబ్బంది లేదా అధికారులు లంచం అడిగితే తెలియజేయాలని సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖి తెలిపారు. సీఎం ప్రత్యేకడీ అవినీతి ఫిర్యాదులు స్వీకరించేందుకు సిద్ధంగా ఏర్పాట్లు ఉన్నాయి. లంచం అడిగితే 040 – 2345 4884 లేదా 7680901912 నంబర్లకు కూడా కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు.
కొంతమంది సిబ్బంది, అధికారులు లంచాలు తీసుకుంటూ సంస్థకు చెడ్డపేరు తీసుకొస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అవినీతిని అడ్డుకునేందుకే ఈ ప్రత్యేక ఏర్పాటు చేశామన్నారు. అంతేకాదు ఉద్యోగులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించినా లేదా విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నా సహించేది లేదని తేల్చిచెప్పారు. అలాగే నూతన సేవలు అందించడం, కేటగిరి, టైటిల్ ట్రాన్స్‌ఫర్, బిల్లింగ్ లోపాలు వంటి ఇతర సేవలను పొందడం కూడా సంస్థ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో అవకాశం కల్పించామని పేర్కొన్నారు.
Get real time update about this post category directly on your device, subscribe now.