విజయసాయి రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యల పట్ల నిరసన..

by RMK NEWS
0 comments

రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అలియాస్ వీసా రెడ్డి జర్నలిస్టులను అసభ్య పదజాలంతో దూషించడాన్ని ఖండిస్తూ పి.గన్నవరం త్రీ రోడ్ జంక్షన్లో ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేఖరులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విజయసాయిరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు ప్రెస్‌ మీట్‌ ఏర్పాటుచేసి అందులో విజయసాయి రెడ్డి మాట్లాడిన తీరు తీవ్ర అభ్యంతరకరమన్నారు. మీడియా ప్రతినిధులను అసభ్య పదజాలంతో దూషించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తక్షణమే మీడియా యాజమాన్యానికి, ప్రతినిధులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేనిచో రాసలీలల రెడ్డిని ఉతికి ఆరేస్తామని హెచ్చరించారు.. ఖబడ్దార్ వీసా రెడ్డి.. ఖబడ్దార్..ఖబడ్దార్ అంటూ నినాదాలు చేశారు.. ఈ కార్యక్రమం లో పిల్లి శేఖర్ చోడపనిడి చిన్ని వేండ్ర శ్రీనివాస్ చైతన్య జి ఏడుకొండలు పుచ్చకాయల అశోక్
యాo ట్రశ్రీనివాస్ తాటికాయల ధనరాజు షణ్ముఖ నాని రాజు. టి. రాజా.రాజు షేక్ దొరబాబు. జనసేన బిజెపి తెలుగుదేశం నాయకులు మద్దతు ప్రకటించారు

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like