వైసిపి అధినేత జగన్ పై విరుచుకుపడిన షర్మిల.. అసెంబ్లీకి వెళ్లకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు – RMK News

by RMK NEWS
0 comments
వైసిపి అధినేత జగన్ పై విరుచుకుపడిన షర్మిల.. అసెంబ్లీకి వెళ్లకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు


వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి వైసిపి వెళ్లకపోవడంపై ఆమె తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు వైసిపి అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు అంటూ వైఎస్ షర్మిల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీద అలగడానికో, మైకు ఇస్తేనే పోతానని మారం చేయడానికో ప్రజలు ఓట్లేయలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించలేదని, స్వయం హోదా కృతాపరాధం మిమ్మల్ని ప్రతిపక్షానికి దూరం చేస్తే, ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతానడం అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనమన్నారు. అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్యంలో దేవాలయమని, ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల అధికార పక్షాన్ని నిలదీసేందుకు ప్రజలు ఇచ్చే గొప్ప అవకాశంగా భావించాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు దిక్కులేదని, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు నోచుకోలేదన్న షర్మిల.. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది.

మహిళలపై దాడులు ఆగడం లేదని, ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని పేర్కొన్నారు. బెల్టు షాపుల దందాను అరికట్టలేదని, ఐదు నెలలైనా ఒక్క ఉద్యోగం కూడా భర్తీ కాలేదని. రోజురోజుకు నిరుద్యోగం పెరుగుతోందని, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా గొంతుక అవకాశం వైసిపికి ప్రజలు ఇచ్చారని, ప్రతిపక్షం ఇస్తేనే వస్తామని అనడం సిగ్గు చేటన్నారు. ప్రతిపక్షం లేకుంటే సభలోనే ప్రజాపక్షం అవ్వాలని, ఇంగితం కూడా లేకపోవడం బాధాకరమన్నారు. 1994లో కాంగ్రెస్ పార్టీ 26 సీట్లకే పరిమితం అయినా కుంగిపోలేదని, మీ లెక్కన హోదా కావాలని మారం చేయలేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 26 మంది సభ్యులతో సభలో ప్రజల పక్షంగా నిలబడ్డామని, ఎన్నో సమస్యలపై నాడు టీడీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించిన కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు.

2014లో 44 సీట్లకే పరిమితం అయినా, 2019లో 52 సీట్లకే వచ్చిన ప్రతిపక్షం అడగలేదని, హోదా లేకున్నా రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ప్రజా సమస్యలపై తమ గొంతు వినిపించారని పేర్కొన్నారు. నియంత మోడీ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారని, దేశ ప్రజల సమస్యలపై కాంగ్రెస్ గొంతుకగా మారిందన్నారు. ఇప్పటికైనా మీ పిచ్చితనాన్ని పక్కన పెట్టి అసెంబ్లీకి వెళ్ళాలని సూచించారు. అసెంబ్లీకి వెళ్లి కూటమి నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలని, అసెంబ్లీకి వెళ్ళే దమ్ము ధైర్యం లేకుంటే వైసిపి శాసనసభా పక్షం అంతా రాజీనామా చేయాలని డిమాండు చేశారు. అప్పుడు ఇంట్లో కాదని, ఎక్కడైనా కూర్చుని తాపీగా మాట్లాడాలని షర్మిల డిమాండ్ చేశారు.

అమృత్ టెండర్లలో రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగం.. కేంద్ర మంత్రి ఖట్టర్‌కు కేటీఆర్ ఫిర్యాదు
బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ పండ్లు అస్సలు తినొద్దు

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like