వైసీపీ నుంచి టిడిపిలోకి ఆగని వలసలు.. అదే బాటలో మాజీ మంత్రులు – RMK News

by RMK NEWS
0 comments
వైసీపీ నుంచి టిడిపిలోకి ఆగని వలసలు.. అదే బాటలో మాజీ మంత్రులు


గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవం తరువాత వైసిపి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. వైసిపి అధికారంలో ఉండగా పదవులు అనుభవించిన ఎంతోమంది నేతలు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే కీలక నాయకులు టిడిపి, జనసేనలోకి వెళ్లిపోయారు. మరి కొంతమంది అదే బాటలో పయనించడానికి సిద్ధమవుతున్నారని. సర్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం మౌనాన్ని దాల్చిన మాజీ మంత్రి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఆళ్ల నాని కొద్ది రోజుల కిందటే పార్టీ అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తాజాగా కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. కొద్దిరోజుల్లోనే టీడీపీలో చేరేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఇప్పటికే టిడిపికి చెందిన ముఖ్య నేతలతో ఆయన చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఏలూరు నియోజకవర్గంలోని కీలక నాయకులంతా పార్టీకి రాజీనామా చేశారు. ఆళ్ల నాని కూడా ఒకటి రెండు రోజుల్లో సైకిల్ ఎక్కేందుకు ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతున్నారు. గడిచిన ఎన్నికల్లో ఏలూరు నుంచి నాలుగోసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ఆ తర్వాత నుంచి సైలెంట్ అయిన ఆయన కొద్ది రోజులకే వైసీపీకి రాజీనామా చేశారు. మొదట జనసేనలో చేరుతారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆయన టిడిపిలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. అలాగే భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి కూడా టిడిపిలో చేరే అవకాశాలు ఉన్నాయని శ్రీనివాస్ చెబుతున్నారు. ఇప్పటికే ఆయన ఏర్పాట్లు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు టిడిపికి చెందిన ముఖ్య నాయకులతో ఆయన సంప్రదింపులు ఉన్నాయి. గడిచిన కొద్ది రోజులుగా ఆయన ఆస్తులు పై దాడులు జరుగుతున్నాయి. ఈ ఇబ్బందులను ఎదుర్కోవడం కంటే పార్టీ మారడం ఉత్తమం అన్న ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు గుర్తించారు. జనసేనలోకి ఆయనను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన టిడిపిలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసిన పార్టీలు వెల్లడిస్తున్నాయి. ఇదిలా ఉంటే మరో మాజీ మంత్రి శ్రీ రంగనాథరాజు కూడా వైసీపీని వీడతారని ప్రచారం. ఆయన కూడా సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి సైలెంట్ అయిపోయారు. కొద్దిరోజుల్లోనే ఆయన టిడిపిలో చేరతారని అంటున్నారు. ఈ మేరకు టిడిపి ముఖ్య నాయకులతో ఆయన సంప్రదింపులు జరిపినట్లు చెబుతున్నారు.

టిడిపి అగ్రనాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి పార్టీలో చేరేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. తాజా పరిణామాలతో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో వైసిపి తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుత పార్టీ నుంచి నాయకులు చేజారి పోకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ పార్టీ క్యాడర్ చెబుతోంది. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించినట్లు చెబుతున్నారు. పార్టీ మారాలని పార్టీ నేతలతో మాట్లాడాలని నేత సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు సీనియర్ నేత బొ సత్యనారాయణ వంటి వారికి సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొద్ది రోజులు ఇబ్బందులు, పార్టీ కష్టకాలంలో ఉన్నవారికి అధికారంలోకి వచ్చినప్పుడు భరోసా కల్పిస్తామని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి ఇబ్బందుల నుంచి క్యాడర్‌కు మానసిక స్థైర్యాన్ని కల్పించే ఉద్దేశంతో ఆయన జనవరి నుంచి నియోజకవర్గాల పర్యటనకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. వైసీపీ నుంచి ఎంత నాయకులు వెళ్లిపోయిన కేడర్ బలంగా ఉందని కూడా ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ ఐదేళ్లు వైసిపికి తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

తేలని మహారాష్ట్ర పంచాయతీ.. ఇద్దరు పరిశీలకులను పంపిస్తున్న బిజెపి
జుట్టు పెరగడానికి చిట్కాలు | జుట్టుకు ఈ ఫుడ్స్ మీ ఆహారంలో పెరగనివ్వండి

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like