సమగ్ర కులగణన ను విజయవంతం చేయాలి… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – RMK News

by RMK NEWS
0 comments
సమగ్ర కులగణన ను విజయవంతం చేయాలి... - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



2

  • బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తన్నీరు రాంప్రభు

తుంగతుర్తి ముద్ర :- తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర కులగణనను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తన్నీరు రాంప్రభు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా తుంగతుర్తి నియోజకవర్గ బీసీ కులాల, వివిధ పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం బీసీ సమగ్ర కుల గణన చైతన్య వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు అయినా ఏ పార్టీ కూడా సమగ్ర కులగణన చేయలేదనీ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తాము తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుల గణన చేసి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించడం జరిగిందనీ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కులాలు, బీసీ సంఘాలు ఐక్యతగా నిలబడి కులగణన సాధించుకోవడం కోసం రిజర్వేషన్లను సాధించుకోవడం కోసం శక్తి వంచన లేకుండా కృషిచేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగిందనీ.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కులగణన హామీని నెరవేర్చాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వాన్ని ఒప్పించి సమగ్ర కులగణన చేయడానికి జీవో నెంబర్ 18 ని తీసుకురావడం జరిగిందనీ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరుగుతోంది కాబట్టి అన్ని కులాలు సహకరించి తమ కులం పేరును కచ్చితంగా చెప్పి కులం గౌరవాన్ని, అస్తిత్వాన్ని కాపాడుకోవాలని. ఈ కులగణన జరగడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ లోని 136 కులాల విద్యాపరంగా, ఉద్యోగ పరంగా, సామాజికపరంగా, రాజకీయపరంగా, అన్ని రంగాలలో అవకాశాలు దొరకడం జరుగుతుంది కాబట్టి ఇంతవరకు రాజకీయ ప్రాబల్యం లేని కులాలు కూడా రాజకీయ ప్రాబల్యం జరుగుతుందనీ అన్నారు. అదే విధంగా ప్రతి కులానికి కూడా వారి జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన అనేక రకాల సంక్షేమ పథకాలలో అన్ని కులాలకు కూడా అవకాశాలు కూడా దొరకడం లేదు. రాష్ట్రంలోని సబ్బండ వర్గ సమగ్ర కులగణనను విజయవంతం చేసి మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని ప్రకటించింది.ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పెద్ద బోయిన అజయ్, కొండ రాజు, బ్రహ్మం, యాదగిరి, ఎల్సోజు చంటి, వెంకటేశ్వర్లు, పులుసు వెంకటనారాయణ, పులుసు వెంకన్న, కటకం సూరయ్య, అంబటి రాములు, పెండెం మసూదన్,అక్కినపల్లి రాములు, సంజీవ, ఎండి రఫిక్, రవి, గోపగాని రమేష్, కోరుకొప్పుల నరేష్ కొనసాగుతున్నారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like