సౌదీ ఎడారిలో తప్పిపోయి తెలంగాణ యువకుడి మృతి

by RMK NEWS
0 comments

కరీంనగర్‌కు చెందిన షహబాజ్ ఖాన్ (27) సౌదీలోని ఎడారిలో దయనీయ స్థితిలో చనిపోయారు. అల్ హాసాలో టవర్ టెక్నీషియన్ అయిన అతడు 5 రోజుల క్రితం సహచరుడితో కలిసి కారులో ఓ చోటుకు వెళ్లారు. GPS పని చేయకపోవడంతో దారి తప్పి ప్రమాదకరమైన రబ్ అల్ ఖలీ అనే ఎడారిలోకి వెళ్లిపోయారు. ఫోన్ స్విచ్ఛాఫ్ కావడం, పెట్రోల్ అయిపోవడంతో అందులోనే చిక్కుకుపోయారు. డీహైడ్రేషన్, విపరీతమైన ఎండతో పూర్తిగా బలహీనపడి ఇద్దరూ ప్రాణాలు వదిలారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like