అనంతపురం జిల్లా పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, చలపతిని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు మైదుకూరు ఆంజనేయులు కలిశారు. ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన, స్టాండ్ ఆఫ్ ఇండియా అనేక సంక్షేమ పథకాలు గురించి చర్చించారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఈ పథకాల అమలు గురించి వివరించి వారిని ఆర్థికంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, త్వరలో ఈ పథకాల అమలు గురించి అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే విశ్వకర్మ యోజన పథకంలో జరుగుతున్నటువంటి అవకతవకలను వారి దృష్టికి తీసుకెళ్లి దానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాల కoబగిరి రామంజి, మందల శివ తదితరులు పాల్గొన్నారు.
Get real time update about this post category directly on your device, subscribe now.