74
రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు మొత్తం 80 రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా మరో 48 ట్రైన్లను దారి మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో విశాఖపట్నం నుంచి కడప వెళ్లే తిరుమల ఎక్స్ప్రెస్ను కూడా అధికారులు రద్దు చేశారు. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లే రత్నాచల్ ఎక్స్ప్రెస్ను భీమవరం మీదుగా దారి మళ్లించారు. అక్కడ పూర్తిగా ట్రాక్లు పూర్తిగా వరద నీటికి కొట్టుకుపోవడంతో టైన్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక కాజీపేట, రాయనపాడులో ట్రాక్లు తెగిపోవడంతో రైళ్లను పూర్తిగా అధికారులు ఎక్కడికక్కడ నిలిపివేశారు.
Get real time update about this post category directly on your device, subscribe now.