వరదలపై ఏపీలో రాజకీయం.. విమర్శ, ప్రతి విమర్శలతో రాజకీయ వేడి – RMK News

by RMK NEWS
0 comments
వరదలపై ఏపీలో రాజకీయం.. విమర్శ, ప్రతి విమర్శలతో రాజకీయ వేడి


ఏపీలో వరదలతో అల్లాడుతున్న ప్రజలను ఆదుకోవాల్సిన పాలక, ప్రతిపక్షాలు.. రాజకీయపరమైన విమర్శలు చేసుకుంటూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేయడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ఎన్నడూ లేని విధంగా తాజాగా వరద లతో విజయవాడ ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. విజయవాడతోపాటు చుట్టుపక్కల అనేక ప్రాంతాలు నీట మునిగిపోవడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. గడిచిన ఐదు రోజులుగా తినేందుకు తిండి లేక, తాగేందుకు నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో బాధితులకు అవసరమైన సహాయ చర్యలను వేగవంతం చేయాల్సిన పాలక, ప్రతిపక్షాలకు చెందిన నేతలు విమర్శలు చేసుకుంటుండడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమను ఆదుకోవాల్సిన నేతలు ఒకరిపై ఒకరు బురదజల్లుకోవడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. వరదల్లో ముంపునకు గురైన ప్రాంతాల్లోని ప్రజలను పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్‌ రెండు రోజులు కిందట వెళ్లారు. కృష్ణలంక ప్రాంత ప్రజలను వరద నుంచి కాపాడేందుకు నిర్మించిన వాల్‌ వద్దకు వెళ్లిన జగన్ అక్కడి ప్రజలను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులను ఆయన ఓదార్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వరదలపై ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమైందంటూ. మనుషులు స్వయంకృతం వల్ల ఏర్పడిన వరదలుగా ఆయన గురించి. స్పందించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర స్థాయిలో జగన్‌పై విమర్శలు గుప్పించారు.

విపత్తు సమయంలో ప్రజలకు సహాయం చేయకుండా విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. బాబాయ్‌ను చంపిన వ్యక్తులు ఉంటే అనుమానించాల్సి ఉంటుందని, ప్రకాశం బ్యారేజీలోకి పడవలు వెళ్లిన వ్యవహారంపై విచారణ జరిపినట్లు తెలిసింది. వైసీపీ నాయకులు ప్రజలకు సాయం చేయడం లేదంటూ. వైసీపీ కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. వరదల్లో తమ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదే సమయంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఎక్కడా కనిపించడం లేదంటూ వైసీపీ నాయకులు విమర్శలు గుప్పించారు.దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్‌ తనను విమర్శిస్తున్న వైసీపీ నాయకులు ఇకపై ఎప్పుడైనా తనతో వస్తే ఎలా ఉంటుందో తెలుస్తుందంటూ. విమర్శలు మాని సహాయం చేయడానికి పవన్ కల్యాణ్‌ వైసీపీ నాయకులకు సూచించారు. ఇదే వ్యవహారంపై మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య వాడీవేడిగా మాటల యుద్ధం కొనసాగుతోంది. టీడీపీ సహాయం పేరుతో ప్రచారానికి పాకులాడుతోందని వైసీపీ విమర్శిస్తుంటే.. వైసీపీ వరదలను అనవసరంగా రాజకీయం చేస్తోందంటూ టీడీపీ విమర్శిస్తోంది. ఏది ఏమైనా వరదల వ్యవహారంపై విమర్శలు చేయడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.

50 ఏళ్లు దాటినా యవ్వనంగా కనిపించాలంటే రోజూ ఈ పనులు చేయాలి
కీర్తి సురేష్ | నీలం రంగు చీరలో కీర్తి సురేశ్

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like