Home తాజా వార్తలుప్రశ్న రావణ్ : నన్ను చంపేయండి.. లేదా చనిపోతా : ప్రశ్న రావణ్ – RMK NEWS

ప్రశ్న రావణ్ : నన్ను చంపేయండి.. లేదా చనిపోతా : ప్రశ్న రావణ్ – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

ప్రశ్న రావణ్ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పై , అదే విధంగా హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అతనికి 4 సార్లు బెయిల్ వచ్చింది , ఇక కేసులు లేవు , ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్న సమయం లో ఏలూరు చెక్ పోస్ట్ వద్ద మరోసారి ఆయన్ని మరో కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ అయ్యే […]

ప్రశ్న రావణ్ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పై , అదే విధంగా హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అతనికి 4 సార్లు బెయిల్ వచ్చింది , ఇక కేసులు లేవు , ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్న సమయం లో ఏలూరు చెక్ పోస్ట్ వద్ద మరోసారి ఆయన్ని మరో కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ అయ్యే ముందు రావణ్ మీడియా కి విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లపై ఆయన ఆరోపణలు చేస్తూ మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియా లో వైసీపీ పార్టీ అభిమానులు ఒక రేంజ్ లో వ్యాప్తి చేస్తూ కూటమి ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు.

రావణ్ మాట్లాడుతూ ‘నాలుగు రోజుల నుండి అన్నం తినడం లేదు , నిరాహార దీక్ష చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి ఒక్కటే చెప్తున్నాను , మీరు నన్ను చంపాలని అనుకుంటే లాక్ లోనే చంపేయండి , లేదంటే నేనే నిరాహార దీక్ష కొనసాగించి చనిపోతాను. నేను చనిపోవచ్చు, కానీ ప్రశ్న చనిపోదు , ప్రశ్నించేవాళ్ళు చనిపోరు. నాలుగు సార్లు బెయిల్ వచ్చి , ఐదవ సారి కూడా అరెస్ట్ అయిన ఏకైక వ్యక్తిని బహుశా ఈ ప్రపంచంలోనే నేను మొదటి వ్యక్తిని అయ్యి ఉంటాను. నా ఒక్కడి కోసం పోలీస్ వ్యవస్థ వాడుతున్నారు. జనసేన పార్టీ నియోజక వర్గాల్లో నన్ను తిప్పుతూ, అక్కడ గుండాలతో దాడి చేయించే ప్రయత్నం చేస్తున్నారు. పాపం పోలీసులు నాకోసం సెక్యూరిటీ ని మైంటైన్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు. ఒక్క మనిషి కోసం వ్యవస్థ ఉపయోగించుకుంటూ ప్రజా ధనాన్ని వినియోగించుకుంటున్నారు’.

‘రాష్ట్రము లో ఎన్నో సమస్యలు ఉంటే వాటిని వదిలేసి , నన్ను టార్గెట్ చేయడం న్యాయమా?, నేను ఏమైనా మర్డర్లు చేశానా ?, మానభంగాలు చేశానా ?, సుగాలి ప్రీతీ చనిపోతే ఆ అమ్మాయికి న్యాయం చేయడం కోసం ఎప్పుడైనా ఇలా వ్యవస్థను వాడుకున్నారా?, జనాలు అన్నీ చూస్తున్నారా అండీ. మీరు నన్ను జైళ్ల చుట్టూ తిప్పినన్ని రోజులు , నేను నిరాహార దీక్ష చేస్తూనే ఉంటాను , దీక్ష చేయడం నా హక్కు ‘ అంటూ ప్రశ్న రావణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. మరి రాబోయే రోజుల్లో ఈ కేసు అంశం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
సోనియా ఆత్మకథ.. ఎందుకు ఈ వివాదం.. ఇంతకీ పుస్తకం - RMK NEWS

సోనియా గాంధీ ఆత్మకథ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు.. ఒకప్పటి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తన…

46 minutes ago
Rise Survey : సంచలన సర్వే : ఏపీలో కూటమి vs వైసీపీ - RMK NEWS

Rise Survey Praveen Pullata : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగర మోగేందుకు రంగం సిద్ధమవుతోంది. ఒకవైపు…

50 minutes ago
BRICS summit: ఒకప్పుడు ప్రగతి మైదానం.. ఇప్పుడు భారత్ మండ -RMK NEWS

BRICS summit: బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. ప్రపంచ దేశాల అధినేతలు వచ్చిన నేపథ్యంలో ఈ స్థాయిలో…

1 hour ago
Hyderabad Biryani : ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీనే - RMK NEWS

హైదరాబాద్ బిర్యానీ : భోజన ప్రియులు అత్యంత ఇష్టంగా తినే వంటకాల్లో బిర్యానీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది…

2 hours ago
Middle East Conflict : సౌదీ-పాక్ డ్రామా: "మింగ మెతుకు లేదు.. -RMK NEWS

మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి.…

2 hours ago