Home తాజా వార్తలుRussia Airport Incident : ఇది ఎర్ర బస్సు కాదు.. ఎయిర్ బస్సు..! – RMK NEWS

Russia Airport Incident : ఇది ఎర్ర బస్సు కాదు.. ఎయిర్ బస్సు..! – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


Russia Airport Incident ఒకప్పుడు మనకు కావాల్సిన బస్సు వెళ్తుంటే వెనుక పరుగెత్తుకుంటూ వెళ్లి ఆపాలని కోరేవారు. దీంతో ఆ బస్సు డ్రైవర్ గుర్తించి బస్సును ఆపేవారు. కానీ ఇప్పుడు ప్లాన్ యుగం.. ఒకసారి విమానం కదిలిందంటే.. అత్యవసరం అయితే తప్ప ఆపడం అసాధ్యం. కానీ ఓ మహిళ తన బ్యాగుతో సహా రన్ వే పైకి వెళ్లి విమానాన్ని ఆపమని కోరింది. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసా? దీనికి సంబంధించిన వీడియో సోషల్ […]

Russia Airport Incident ఒకప్పుడు మనకు కావాల్సిన బస్సు వెళ్తుంటే వెనుక పరుగెత్తుకుంటూ వెళ్లి ఆపాలని కోరేవారు. దీంతో ఆ బస్సు డ్రైవర్ గుర్తించి బస్సును ఆపేవారు. కానీ ఇప్పుడు ప్లాన్ యుగం.. ఒకసారి విమానం కదిలిందంటే.. అత్యవసరం అయితే తప్ప ఆపడం అసాధ్యం. కానీ ఓ మహిళ తన బ్యాగుతో సహా రన్ వే పైకి వెళ్లి విమానాన్ని ఆపమని కోరింది. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసా? దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.

రష్యా దేశంలోని ఓ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు మహిళలు ఓ సాహసం చేసి వార్తల్లో నిలిచారు. జూలై 25న మాస్కోలోని షెరేమెత్యేవో ఎయిర్‌పోర్టులోకి ఇద్దరు మహిళలు తమ ఏరోఫ్లోట్‌ విమానానికి ఆలస్యంగా చేరుకున్నారు. అప్పటికే బోర్డింగ్‌ పూర్తవడంతో విమానం గేట్‌ నుంచి బయటకు కదులుతోంది. విమానం తమ కళ్ల ముందే వెళ్లిపోతుంటే ఎయిర్‌పోర్టు సిబ్బంది నేరుగా విమానం వైపు పరుగెత్తారు. అదనంగా చేతులు ఊపుతూ విమానాన్ని ఆపాలని ప్రయత్నించారు.

విమానం కదులుతున్న సమయంలో దాని దగ్గరకు ప్రయాణికులు వెళ్లడం అసాధ్యం. బోర్డింగ్ పూర్తి కాగానే రన్ వే కు వెళ్లే దారి మూసివేస్తారు. ఒకవేళ ఎవరైనా ఇలా వెళ్లాలని ప్రయత్నించినా.. భద్రతా సిబ్బంది అడ్డుకుంటారు. ఇక్కడ కూడా ఇద్దరు మహిళలు ఎయిర్‌పోర్టు ఎయిర్‌సైడ్ ప్రాంతంలోకి వెళ్లడంతో అక్కడి సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. గ్రౌండ్ ఆపరేషన్ కొద్దిసేపు నిలిచిపోయింది. సిబ్బంది, భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని మహిళలను విమానం దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్లారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

విమానాన్ని ఆపాలని ప్రయత్నించిన వారికి జరిమానా పడే అవకాశం ఉంది. నిర్లక్ష్యంగా నిబంధనలు ఉల్లంఘించిన సందర్భంలో వీరికి సుమారు 5,000 రూబిళ్ల వరకు జరిమానా ఉండొచ్చని, ఉద్దేశపూర్వక ఉల్లంఘనగా పరిగణిస్తే మరింత ఎక్కువ జరిమానా విధించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే విమానం మిస్‌ అయితే తదుపరి విమానంలో ప్రయాణించే అవకాశం ఉంటుంది. అందుకోసం ఎయిర్‌లైన్ సిబ్బందిని సంప్రదించాలి. కానీ ఇలా ఎవరైనా చేస్తారా? ఇది ఎయిర్ బస్సు అనుకున్నారా? ఎర్ర బస్సు అనుకున్నారా? అంటే సోషల్ మీడియాలో కాలు పెడుతున్నారు.



You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
హనీమూన్ కోచ్ : రైలులో 'హనీమూన్ కోచ్'.. అరె ఎంట్రా ఈ ఎంజాయ్ - RMK NEWS

హనీమూన్ కోచ్ : మీరు ఇండోనేషియాలోని బాలీ వెళ్లారా.. లేదా మనదేశంలో ఉన్న కేరళ రాష్ట్రానికి వెళ్లారా.. ఇక్కడ…

17 hours ago
ఆంధ్ర ప్రదేశ్: ఏపీ ఖజానా ఇలా అయిందేంటి.. జగన్ కు - RMK NEWS

ఆంధ్ర ప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుడ్ న్యూస్. ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతున్న ఆ రాష్ట్రం ఇప్పుడు గాడిలో…

17 hours ago
India China Russia : రష్యాకు జైశంకర్, చైనాకు అజిత్ ధోవల్.. ఎందుకు వెళ్లారంటే..వెలుగులోకి సంచలన ని...

India China Russia : ఇండియా అంటే చాలు చైనా తన కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. మన సరిహద్దులను…

17 hours ago
pawan kalyan : కొత్త వెర్షన్‌లో పవన్ కల్యాణ్.. అభిమానులు - RMK NEWS

pawan kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ స్టైలే వేరు. ఆయన వేదిక…

17 hours ago
Samsung S9 OH OLED TV: లక్ష రూపాయల్లో.. మీ ఇంటికి థియేటర్ -RMK NEWS

Samsung S9 OH OLED TV: నేటి కాలంలో టీవీలు కేవలం ప్రసారాలు మాత్రమే కాదు.. అంతకుమించి.. పైగా…

17 hours ago