Home అంతర్ జాతీయగోకుడు కూడా ఒక వ్యాపారమే.. ఇతడు నెలకు ఎంత -RMK NEWS

గోకుడు కూడా ఒక వ్యాపారమే.. ఇతడు నెలకు ఎంత -RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

చైనాలో స్క్రాచింగ్ బిజినెస్: దురద పెడితే గోక్కుంటాం.. ఇది కూడా ఒక పనేనా అని చాలామంది అనుకోవచ్చు. కానీ ఇది కూడా పని అని.. చాలామందికి గోక్కోవడానికి కూడా ఖాళీ ఉండదని.. గోకడం కూడా ఒక బిజినెస్ అని నిరూపించాడు ఇతడు. అంతేకాదు, లక్షలు సంపాదిస్తున్నాడు. చైనాలో గోకడాన్ని ఒక వ్యాపారంగా మార్చాడు జాంగ్ అనే వ్యక్తి. ఇతడికి సోషల్ మీడియాలో రీల్స్ చూడటం విపరీతంగా ఇష్టం. కొత్త కొత్త షార్ట్స్ కూడా చూస్తూ […]

చైనాలో స్క్రాచింగ్ వ్యాపారం: దురద పెడితే గోక్కుంటాం.. ఇది కూడా ఒక పనేనా అని చాలామంది అనుకోవచ్చు. కానీ ఇది కూడా పని అని.. చాలామందికి గోక్కోవడానికి కూడా ఖాళీ ఉండదని.. గోకడం కూడా ఒక బిజినెస్ అని నిరూపించాడు ఇతడు. అంతేకాదు, లక్షలు సంపాదిస్తున్నాడు.

చైనాలో గోకడాన్ని ఒక వ్యాపారంగా మార్చాడు జాంగ్ అనే వ్యక్తి. ఇతడికి సోషల్ మీడియాలో రీల్స్ చూడటం విపరీతంగా ఇష్టం. కొత్త కొత్త షార్ట్స్ కూడా చూస్తూ ఉంటాడు. అయితే ఆ మధ్య ఇతడు సోషల్ మీడియాలో వీడియోలు చూస్తుండగా ఒక భార్య తన భర్త వీపు గోకుతున్న వీడియోను అతడు చూశాడు. దీంతో అది అతనికి వింతగా అనిపించింది. దీని ద్వారా వ్యాపారం చేస్తే బాగుంటుందనిపించింది. ఇంకేముంది ఆచరణలో పెట్టాడు. దర్జాగా సంపాదించడం మొదలుపెట్టాడు.

గోకడం కోసం ప్రత్యేకంగా గోర్లను పెంచుకున్నాడు. కాకపోతే వాటిని శానిటైజ్ చేస్తూ ఉంటాడు. కస్టమర్ల కోరిక మేరకు కొన్ని చేతులకు తొడుగులు కూడా ధరిస్తుంటాడు. కస్టమర్లు కోరుకున్న విధంగా గోకుతూ ఉంటాడు. కొన్నిసార్లు అయితే మసాజ్ కూడా చేస్తాడు. అయితే ఈ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాలలో రికార్డు అయ్యే విధంగా చూస్తూ ఉంటాడు. కస్టమర్లు ఆడవాళ్లు లేదా మగవాళ్ళు అయినా అందరినీ ఒకే విధంగా రిసీవ్ చేసుకుంటాడు. ఎవరితో కూడా అసభ్యకరంగా ప్రవర్తించాడు. పైగా తన వీడియోలను రకరకాల క్రియేటివ్ విధానాలలో ఎడిటింగ్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు.

గోర్లతో గోకడం ద్వారా జాంగ్ గంటకు 4200.. నెలకు ఏకంగా 14 లక్షలు సంపాదిస్తున్నాడు. వాస్తవానికి మసాజ్ కంటే కూడా ఇలా గోకడం చాలామందికి రిలాక్స్ ఇస్తోందని చెబుతున్నాడు..”నా దగ్గరికి చాలామంది వస్తున్నారు. వారంతా కూడా రకరకాల కోణాలలో శరీరాన్ని గోకాలి అని చెబుతుంటారు. ఇలాంటి వ్యాపారం ద్వారా.. ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా డబ్బులు సంపాదించడం ఆనందంగా ఉందని” జాంగ్ చెబుతున్నాడు.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
Nara Lokesh : మంగళగిరిలో నారా లోకేష్ ప్రజాదర్బార్ - RMK NEWS

Nara Lokesh : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ జరిగింది.…

3 hours ago
YS Sunitha Reddy: డాక్టర్ సునీత రెడ్డి.. పులివెందుల ప్రహ్లాద.. - RMK NEWS

YS Sunitha Reddy: కన్న తండ్రి కళ్ళముందే రక్తపు మడుగులో.. అప్పటిదాకా మాట్లాడి.. కుశల ప్రశ్నలు అడిగిన ఆయన…

3 hours ago
Sleep divorce trend : భార్యాభర్తల మధ్య ఎందుకు ఈ ఆగడం.. భారత్ లో పెరుగుతున్న ప్రమాదకర ధోరణి! - RMK...

Sleep divorce trend : కలిసి ఉంటే కలదు సుఖం అంటారు. కలిసి ఉంటూనే విడిగా ఉండడాన్ని ఏమంటారు..…

3 hours ago
Durandhar 2 story inspiration : దురంధర్ మాదిరిగానే.. ఒక్కో ఉగ్రవాది ఒక్కో తీరుగా..గూస్ బంప్స్ తెప...

Durandhar 2 story inspiration : దురంధర్.. ఇది సినిమా కాదు..ప్రతీ భారతీయుడి రివేంజ్. కొంతమంది మినహా మిగతవారంతా…

3 hours ago
AP Panchayat Elections : పంచాయితీ ఎన్నికల వాయిదా - RMK NEWS

AP పంచాయతీ ఎన్నికలు : ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు ముందే రాజకీయ వేడి రాజుకుంది. ఒకవైపు బీసీలకు 34…

3 hours ago