Home ఆంధ్రప్రదేశ్చంద్రబాబు నాయుడు: జగన్ కు ప్రతిపక్ష హోదా.. లెక్కలతో – RMK NEWS

చంద్రబాబు నాయుడు: జగన్ కు ప్రతిపక్ష హోదా.. లెక్కలతో – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

చంద్రబాబు నాయుడు: చంద్రబాబు నాయుడు సందర్భానికి తగ్గట్టుగా మాట్లాడుతారు. ఎక్కడ కూడా నోరు జారరు. అడ్డగోలుగా మాట్లాడరు. రాజకీయాలను రాజకీయాల మాదిరిగానే చూస్తారు. వ్యక్తిగత విషయాలు కూడా సున్నితత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అందువల్లే ఆయనను స్టేట్స్ మెన్ అని పిలుస్తుంటారు. చంద్రబాబు ఇటీవల కాలంలో తన ధోరణి పూర్తిగా మార్చుకున్నారు. నిజానికి ఒక ముఖ్యమంత్రి కంటే కూడా ఆయన ఒక రాష్ట్రానికి సీఎంగా పనిచేస్తారు అనే చర్చ పొలిటికల్ వర్గాల్లో.. మీడియా వర్గాల్లో సాగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు […]

చంద్రబాబు నాయుడు: చంద్రబాబు నాయుడు సందర్భానికి తగ్గట్టుగా మాట్లాడుతారు. ఎక్కడ కూడా నోరు జారరు. అడ్డగోలుగా మాట్లాడరు. రాజకీయాలను రాజకీయాల మాదిరిగానే చూస్తారు. వ్యక్తిగత విషయాలు కూడా సున్నితత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అందువల్లే ఆయనను స్టేట్స్ మెన్ అని పిలుస్తుంటారు.

చంద్రబాబు ఇటీవల కాలంలో తన ధోరణి పూర్తిగా మార్చుకున్నారు. నిజానికి ఒక ముఖ్యమంత్రి కంటే కూడా ఆయన ఒక రాష్ట్రానికి సీఎంగా పనిచేస్తారు అనే చర్చ పొలిటికల్ వర్గాల్లో.. మీడియా వర్గాల్లో సాగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు చంద్రబాబు 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ధోరణి పూర్తిగా మార్చుకున్నారు. తన మీద ఉన్న అపప్రదను తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలతో మరింతగా మమేకమవుతున్నారు. వారి కష్టసుఖాలను తెలుసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో వారి ఇంట్లో వండిన వంటను తింటున్నారు.

ఒకరకంగా నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు మరింతగా కనెక్ట్ అవుతున్నారు. అయితే అప్పుడప్పుడు ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని వైసిపికి దిమ్మ తిరిగే విధంగా సమాధానం చెబుతున్నారు. అలాగని నోరు జారడం లేదు. అడ్డగోలుగా మాట్లాడటం లేదు. గొడ్డలి భాష ఉపయోగించడం లేదు. నరక్కుంటూ పోతాం.. కోసుకుంటూ వస్తాం అని నేలబారు భాష ఉపయోగించడం లేదు. తన విధానంలోనే చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని వైసిపికి కౌంటర్ కు కూడా అవకాశం కూడా చంద్రబాబు అవకాశం ఇవ్వడం లేదు.

ప్రొద్దుటూరులో జరిగిన జలధార శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రబాబు వైసీపీకి ప్రతిపక్ష హోదా గురించి మరోసారి క్లారిటీ ఇచ్చారు. ప్రజా సమస్యల మీద అసెంబ్లీకి వస్తే మాట్లాడుకుందామని చంద్రబాబు చెప్పారు. ప్రతిపక్ష హోదా కావాలని వైసిపి నేతలు అంటున్నారని.. అది తాను ఇచ్చేది కాదని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ప్రతిపక్ష హోదాను ప్రజలు ఇస్తారని క్లారిటీ ఇచ్చారు. 10 శాతం సీట్లు గెలిస్తే ప్రతిపక్ష హోదా వస్తుందని చంద్రబాబు మరోసారి గుర్తు చేశారు. 2019లో తాము 23 స్థానాలు గెలిస్తే తీవ్రంగా ఇబ్బంది పెట్టారని.. ఐదుగురు ఎమ్మెల్యేలను లాగేసుకుంటే ప్రతిపక్షం కూడా ఉండదని ఎగతాళి చేశారు.

ప్రజా సమస్యల మీద పోరాడే దమ్ము లేనప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు. రాజ్యాంగ విలువలను ఎందుకు తుంగలో తొక్కాలని చంద్రబాబు అసెంబ్లీ ప్రశ్నించారు. ప్రజల విశ్వాసం కోల్పోయినప్పుడు.. ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని వైసిపి నేతలను ఉద్దేశించి.. కాకపోతే ఆయన విలువలతోనే మాట్లాడారు. తన లైన్లోనే ప్రసంగించారు. పరిధి దాటలేదు. మైక్ ఉంది కదా అని అడ్డగోలుగా మాట్లాడలేదు.. మొత్తానికి లెక్కల ద్వారా.. వైసీపీ నేతలకు జ్ఞానోదయం కలిగించారు. ఒక ముక్కలో చెప్పాలంటే ప్రొద్దుటూరు జలధార శంకుస్థాపన సభలో వైసిపికి ర్యాగింగ్ అంటే ఎలా ఉంటుందో చూపించారు.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
సోనియా ఆత్మకథ.. ఎందుకు ఈ వివాదం.. ఇంతకీ పుస్తకం - RMK NEWS

సోనియా గాంధీ ఆత్మకథ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు.. ఒకప్పటి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తన…

3 hours ago
Rise Survey : సంచలన సర్వే : ఏపీలో కూటమి vs వైసీపీ - RMK NEWS

Rise Survey Praveen Pullata : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగర మోగేందుకు రంగం సిద్ధమవుతోంది. ఒకవైపు…

3 hours ago
BRICS summit: ఒకప్పుడు ప్రగతి మైదానం.. ఇప్పుడు భారత్ మండ -RMK NEWS

BRICS summit: బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. ప్రపంచ దేశాల అధినేతలు వచ్చిన నేపథ్యంలో ఈ స్థాయిలో…

3 hours ago
Hyderabad Biryani : ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీనే - RMK NEWS

హైదరాబాద్ బిర్యానీ : భోజన ప్రియులు అత్యంత ఇష్టంగా తినే వంటకాల్లో బిర్యానీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది…

4 hours ago
Middle East Conflict : సౌదీ-పాక్ డ్రామా: "మింగ మెతుకు లేదు.. -RMK NEWS

మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి.…

4 hours ago