Vijayawada Dasara: దసరా అంటే మైసూర్ పేరు రావడం అత్యంత సహజం. రాజవంశ సంప్రదాయం ప్రకారం మైసూర్ ప్యాలెస్ లో విద్యుత్ దీపాలను అందంగా అలంకరిస్తారు. జంబు సవారి నిర్వహించారు. ఏనుగుల ఊరేగింపు జరుపుతారు. ఇలా దశాబ్దాలుగా మైసూర్ ప్రాంతంలో దసరా వేడుకలు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు విజయవాడని కూడా దసరా టూరిజం డెస్టినేషన్ గా నిలబెట్టాలనే ప్రయత్నం జరుగుతోంది. తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. అక్టోబర్ 11 నుంచి 20 […]
విజయవాడ దసరా: దసరా అంటే మైసూర్ పేరు గుర్తుకు రావడం అత్యంత సహజం. రాజవంశ సంప్రదాయం ప్రకారం మైసూర్ ప్యాలెస్ లో విద్యుత్ దీపాలను అందంగా అలంకరిస్తారు. జంబు సవారి నిర్వహించారు. ఏనుగుల ఊరేగింపు జరుపుతారు. ఇలా దశాబ్దాలుగా మైసూర్ ప్రాంతంలో దసరా వేడుకలు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు విజయవాడని కూడా దసరా టూరిజం డెస్టినేషన్ గా నిలబెట్టాలనే ప్రయత్నం జరుగుతోంది. తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.
అక్టోబర్ 11 నుంచి 20 వరకు విజయవాడ ఉత్సవ్ 2026 నిర్వహించబోతున్నారు. పున్నమి ఘాట్ కేంద్రంగా 10 రోజులపాటు ఉత్సవాలు నిర్వహించబోతున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు.. జానపద కళలు.. సంగీతం.. ఫుడ్ ఫెస్టివల్.. దాండియా.. మెగా కార్నివాల్.. ఎగ్జిబిషన్లు.. వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దసరా వేడుకల మీద ప్రముఖంగా దృష్టి సారించారు. ఒకే నగరం ఒక వేడుక కాన్సెప్ట్ తో విజయవాడను సాంస్కృతిక టూరిజం నగర బ్రాండ్ గా తీర్చిదిద్దడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
కనకదుర్గమ్మ దర్శనం.. విజయవాడ ఉత్సవ్.. నేషనల్ సరస్ మేళా.. ఇలా ఈ మూడింటిని కలిపి ఒకే టూరిజం ప్యాకేజ్ లాగా మార్చి.. బయటి రాష్ట్రాల పర్యటకులను ఆకట్టుకునేలా ఉంది. పున్నమి ఘాట్ లో అక్టోబర్ 8 నుంచి 23 వరకు నేషనల్ సరస్ మేళా నిర్వహించబోతున్నారు.. మైసూర్ నుంచి ఏనుగులను విజయవాడకు తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఒక రకంగా ఇది మైసూరు దసరా వాతావరణాన్ని గుర్తుచేసే అంశం. ఇప్పుడంటే ఇప్పుడు కాకపోయినా.. విజయవాడ మైసూర్ ను అధిగమించే అవకాశం ఉంది. మైసూర్ 1610 సంవత్సరం నుంచి దసరా ఉత్సవాల చారిత్రక సంప్రదాయం ఉంది. అయితే విజయవాడకు కనకదుర్గమ్మ ఆలయం.. కృష్ణానది.. ఆధ్యాత్మికత.. తెలుగు సంస్కృతి అదనపు ఆకర్షణగా ఉంది.
దసరా ఉత్సవాలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం విజయ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి హాజరవుతున్నారు.. దసరా ఉత్సవాల ద్వారా విజయవాడ బ్రాండ్‌కు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రదర్శనపరంగా ఏపీకి సరికొత్త గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది.
టూరిజం ద్వారా ఆదాయం భారీగా వస్తూ ఉంటుంది. కేరళ నుంచి మొదలు పెడితే కర్ణాటక వరకు టూరిజం ద్వారా భారీగా ఆదాయాన్ని అక్కడ ప్రభుత్వాలు ఆర్జిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా పర్యాటకపరంగా అనేక అనుకూలతలు ఉన్నాయి. అందువల్లే కూటమి ప్రభుత్వం పర్యాటకపరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరికొత్త గుర్తింపు తీసుకురావడానికి.. మరింత ఉన్నత స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందువల్లే దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. తద్వారా టూరిజం ఆదాయంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.