Home ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్: ఏపీ ఖజానా ఇలా అయిందేంటి.. జగన్ కు – RMK NEWS

ఆంధ్ర ప్రదేశ్: ఏపీ ఖజానా ఇలా అయిందేంటి.. జగన్ కు – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

ఆంధ్ర ప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుడ్ న్యూస్. ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతున్న ఆ రాష్ట్రం ఇప్పుడు గాడిలో పడుతుంది. చంద్రబాబు దర్శనీయకమైన పరిపాలన ఆ రాష్ట్రానికి ఆయువు పట్టు లాగా మారింది. ఆయన నాయకత్వంలో ఏపీ అనేక రంగాలలో అభివృద్ధి సాధిస్తోంది. ఇప్పుడు ఏకంగా జాతీయ సగటును మించిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు జీఎస్టీ వసూళ్లు ఊరట కలిగించే విధంగా ఉన్నాయి. రాష్ట్ర పన్ను ఆదాయం పెరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలలో కదలిక కొనసాగుతోంది. ముఖ్యంగా […]

ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుడ్ న్యూస్. ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతున్న ఆ రాష్ట్రం ఇప్పుడు గాడిలో పడుతుంది. చంద్రబాబు దర్శనీయకమైన పరిపాలన ఆ రాష్ట్రానికి ఆయువు పట్టు లాగా మారింది. ఆయన నాయకత్వంలో ఏపీ అనేక రంగాలలో అభివృద్ధి సాధిస్తోంది. ఇప్పుడు ఏకంగా జాతీయ సగటును మించిపోయింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు జీఎస్టీ వసూళ్లు ఊరట కలిగించే విధంగా ఉన్నాయి. రాష్ట్ర పన్ను ఆదాయం పెరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలలో కదలిక కొనసాగుతోంది. ముఖ్యంగా 2026 సెప్టెంబర్‌లో ఏపీ నెట్ జిఎస్టి వసూళ్లు జాతీయ వృద్ధి సగటును మించిపోయాయి. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రభుత్వం సంతృప్తిని వ్యక్తం చేసింది.

2026 సెప్టెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ నెట్ జిఎస్టి వసూళ్లు 3,182.87 కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది వసూళ్లు సెప్టెంబర్ నెలలో 2,789.50 కోట్లుగా ఉన్నాయి. గత ఏడాదితో పోల్చి చూస్తే వసూళ్ల వృద్ధి 14.1 శాతంగా నమోదైంది. ఇక ఇదే సమయంలో జాతీయ స్థాయిలో పోస్ట్ సెటిల్మెంట్ నెట్ జిఎస్టి వృద్ధి రేటు 8 శాతంగా ఉంది. అంటే జాతీయ సగటుతో పోల్చి చూస్తే ఏ అభివృద్ధికి నమోదైంది.

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్ర నెట్ జిఎస్టి వసూళ్లు 19,635.49 కోట్లకు చేరుకున్నాయి. గత ఎడాది ఇదే కాలంలో 16,760.21 కోట్లుగా వసూళ్ళు ఉన్నాయి. గత ఏడాదితో పోల్చి చూస్తే ఏకంగా 18% వృద్ధి నమోదైంది. మొత్తం కమర్షియల్ ట్యాక్స్ వసూళ్లు కూడా సెప్టెంబర్ నాటికి 30,435.98 కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే సమయానికి 25,892.92 కోట్లుగా ఉన్నది. గత ఏడాదితో పోల్చి చూస్తే వృద్ధిరేటు ఏకంగా 18% అధికంగా నమోదైంది.

ఈ పెరుగుదలకు పన్ను చెల్లింపుల్లో మెరుగైన అనుసరణ.. కట్టుదిట్టమైన తనిఖీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డేటా అనలటిక్స్.. యూపీఐ లావాదేవీల విశ్లేషణ.. ఐ జిఎస్టి రివర్సల్ డిస్కం ఆదారిత నియామక వెరిఫికేషన్ చర్యలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయడంతో ఆదాయం పెరిగింది.

ప్రభుత్వ చర్యలు మాత్రమే కాకుండా.. వినియోగం.. వ్యాపార కార్యకలాపాలు.. పన్ను అనుసరణ వంటి అనేక అంశాలు కూడా జీఎస్టీ వసూళ్లకు దోహదం చేశాయని వాణిజ్య శాఖ అధికారులు చెబుతున్నారు. జాతీయ స్థాయిలో సెప్టెంబర్ 2026లో మొత్తం స్థూల జిఎస్టి వసూళ్లు కూడా 14.7% పెరిగాయి. మొత్తంగా 2.3 లక్షల కోట్లకు చేరుకున్నాయి. మొత్తంగా చూస్తే జిఎస్టి వసూళ్లలో ఏపీ నమోదు చేస్తున్న అభివృద్ధి రాష్ట్ర ప్రజలకు కొంత ఆర్థిక వెసులుబాటు కల్పించే పరిణామం లాగా మారింది. రాబోయే రోజుల్లో ఇదే ధోరణి కొనసాగితే ఏపీ రాష్ట్రం ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధిస్తుంది. సమర్థవంతమైన నాయకత్వం.. ఆర్థిక అంశాలలో పొదుపు వల్ల ఈ స్థాయిలో వసూళ్లు సాధ్యమయ్యాయి. కాగా, ఏపీ ఖజానా ఇలా కావడం.. జగన్ కు మింగుడుపడని వార్త అని టీడీపీ నాయకులు అంటున్నారు.
.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
హనీమూన్ కోచ్ : రైలులో 'హనీమూన్ కోచ్'.. అరె ఎంట్రా ఈ ఎంజాయ్ - RMK NEWS

హనీమూన్ కోచ్ : మీరు ఇండోనేషియాలోని బాలీ వెళ్లారా.. లేదా మనదేశంలో ఉన్న కేరళ రాష్ట్రానికి వెళ్లారా.. ఇక్కడ…

16 hours ago
ఆంధ్ర ప్రదేశ్: ఏపీ ఖజానా ఇలా అయిందేంటి.. జగన్ కు - RMK NEWS

ఆంధ్ర ప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుడ్ న్యూస్. ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతున్న ఆ రాష్ట్రం ఇప్పుడు గాడిలో…

16 hours ago
India China Russia : రష్యాకు జైశంకర్, చైనాకు అజిత్ ధోవల్.. ఎందుకు వెళ్లారంటే..వెలుగులోకి సంచలన ని...

India China Russia : ఇండియా అంటే చాలు చైనా తన కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. మన సరిహద్దులను…

16 hours ago
pawan kalyan : కొత్త వెర్షన్‌లో పవన్ కల్యాణ్.. అభిమానులు - RMK NEWS

pawan kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ స్టైలే వేరు. ఆయన వేదిక…

16 hours ago
Samsung S9 OH OLED TV: లక్ష రూపాయల్లో.. మీ ఇంటికి థియేటర్ -RMK NEWS

Samsung S9 OH OLED TV: నేటి కాలంలో టీవీలు కేవలం ప్రసారాలు మాత్రమే కాదు.. అంతకుమించి.. పైగా…

16 hours ago