Home ఆంధ్రప్రదేశ్pawan kalyan : కొత్త వెర్షన్‌లో పవన్ కల్యాణ్.. అభిమానులు – RMK NEWS

pawan kalyan : కొత్త వెర్షన్‌లో పవన్ కల్యాణ్.. అభిమానులు – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

pawan kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ స్టైలే వేరు. ఆయన వేదిక ఎక్కితే చాలు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇచ్చే విజిల్స్, జనసేన శ్రేణుల కేరింతలతో వాతావరణం క్షణాల్లో వేడెక్కిపోతుంది. ప్రసంగాల్లో ఆవేశం, శారీరకంగా ప్రదర్శించే ఆ స్పీడ్ ఆయన శైలికి ప్రధాన బలం. అయితే, గత కొంతకాలంగా తీవ్రమైన భుజం నొప్పితో పాటు శారీరక అలసట, ఒత్తిడి ఆయన పర్యటనల్లో ప్రభావం చూపిన మాట వాస్తవం.

ముంబై సర్జరీ.. కేరళ రిహాబిలిటేషన్

ఈ ఫిజికల్ ఒత్తిడి నుంచి బయటపడేందుకు పవన్ కల్యాణ్ ముంబైలో భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాతి విశ్రాంతి, కేరళలో సుదీర్ఘంగా సాగిన రిహాబిలిటేషన్ ఆయనకు సరికొత్త శక్తిని ఇచ్చాయి. ప్రస్తుతం ఆయనలో సరికొత్త ‘పవన్ కల్యాణ్ 2.0’ కనిపిస్తున్నారని పార్టీ శ్రేణులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కంటే ఎక్కువ ఫిట్‌గా, తగ్గి, రెట్టింపు ఎనర్జీతో ఆయన సభల్లో, బరువు సమీక్షలో పాల్గొంటున్నారు. మాటల్లో స్పష్టత, ప్రసంగాల్లో ఆ పాత పంచ్ మళ్లీ తిరిగొచ్చాయనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి పవర్ స్టార్ కి ఆ పవర్ పూర్తిగా రీస్టోర్ అయిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఫిట్నెస్ ఓకే.. మరి పొలిటికల్ స్పీడ్ ఎలా?

శారీరక దృఢత్వం ఒక్కటే రాజకీయాల్లో సరిపోదు. రాబోయే ఐదేళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణాన్ని ఐదు నెలల్లోనే పరుగెత్తించడం సరైన వ్యూహం కాదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మైక్ ముందు గట్టిగా మాట్లాడటం, ప్రత్యర్థులపై విరుచుకుపడటం ఎన్నికల సమయంలో అవసరమే అయినా, ఇప్పుడు ప్రాధాన్యతలు మారాయి.

పాలనపై ఫోకస్.. ఫైర్ తర్వాతే!

పవన్ కల్యాణ్ కూడా తగిన సమయంలో తనలోని ‘పాత ఫైర్’ను మళ్లీ బయటకు తీస్తానని స్పష్టం చేస్తున్నారు. కానీ, ప్రస్తుతానికి ప్రజా సంక్షేమం, సమర్థవంతమైన ప్రభుత్వ పాలన (అడ్మినిస్ట్రేషన్)పైనే ఆయన పూర్తి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. మైక్ ఆఫ్ అయినప్పుడు శాఖాపరమైన నిర్ణయాల్లో, పాలన ఫలితాల్లో చూపించే మార్పే నాయకుడికి అసలైన గుర్తింపును ఇస్తుంది.

భుజం నొప్పి తగ్గింది, అలసట మాయమైంది, పూర్తి ఫిట్‌నెస్‌తో పొలిటికల్ రీలాంచ్‌కు పవన్ సిద్ధమయ్యారు. ఇప్పుడు ఈ కొత్త వెర్షన్ ద్వారా పాలనలో ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తారో, రాబోయే రోజుల్లో ఆ ‘పొలిటికల్ ఫైర్’ను ఏ స్థాయిలో తీస్తారో చూడాలి.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
TANA Women : తానా మహిళల కోసం ప్రత్యేకంగా 'దేశీ డాన్స్ -RMK NEWS

250 మందికిపైగా హాజరు TANA మహిళలు : హంటర్స్‌విల్లే: మహిళల ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉత్తర అమెరికా…

18 hours ago
Good Morning

Good Morning

21 hours ago
ఒక పట్టుచీర గతంలో చేసిన ఓ దొంగను పట్టించింది.. - Jananethram News

[ad_1] హైదరాబాద్ క్రైం : పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన లోకం మొత్తం చీకటి కాదు.…

1 day ago
Media Owner : ఆ మీడియా అధినేత ఇంట్లో ఆస్తుల పంచాయితీ - RMK NEWS

Media Owner : ఎదుటి వాళ్ళ లైఫ్ లో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా లెన్స్ వేసుకొని…

1 day ago
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సైబర్ దొంగ - RMK NEWS

[ad_1] BRS మాజీ MLA : ప్రతి సమావేశంలోనూ కేటీఆర్ ఒకటే చెప్తున్నారు. 2028లొ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చేది…

1 day ago