Home ఆంధ్రప్రదేశ్uttarandhra politics: ఉత్తరాంధ్రలో ఫ్యాన్ రెక్కలు విరిగినట్టే.. – RMK NEWS

uttarandhra politics: ఉత్తరాంధ్రలో ఫ్యాన్ రెక్కలు విరిగినట్టే.. – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

uttarandhra politics: స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఉత్తరాంధ్రలో ఫ్యాన్ పార్టీకి దిమ్మతిరిగే షాక్ లు తగులుతున్నాయి. మొన్నటికి మొన్న బొత్స సత్యనారాయణకు అత్యంత సన్నిహితుడైన మజ్జి శ్రీను వైసీపీ నుంచి వెళ్లిపోయారు. టిడిపి కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే.. జెడ్పీ మాజీ చైర్మన్ బద్దుకొండ అప్పలనాయుడు కూడా చేరిపోయారు. అయితే ఆయన టిడిపి కండువా కప్పుకోక పోయినప్పటికీ.. పార్టీ నాయకత్వ తీరు పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ […]

ఉత్తరాంధ్ర రాజకీయాలు: స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఉత్తరాంధ్రలో ఫ్యాన్ పార్టీకి దిమ్మతిరిగే షాక్ లు తగులుతున్నాయి. మొన్నటికి మొన్న బొత్స సత్యనారాయణకు అత్యంత సన్నిహితుడైన మజ్జి శ్రీను వైసీపీ నుంచి వెళ్లిపోయారు. టిడిపి కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే.. జెడ్పీ మాజీ చైర్మన్ బద్దుకొండ అప్పలనాయుడు కూడా చేరిపోయారు. అయితే ఆయన టిడిపి కండువా కప్పుకోక పోయినప్పటికీ.. పార్టీ నాయకత్వ తీరు పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీ అధినేత జగన్ అప్పలనాయుడు సస్పెండ్ చేశారు. దీంతో క్షణాల విధిలోనే అప్పలనాయుడు పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఆత్మగౌరవం నేను చోట తాను ఉండలేనని.. తన అనుచరులు కూడా ఉండలేరని స్పష్టం చేశారు. వైసిపి ఒక రాజకీయ పార్టీ మాదిరిగా లేదు.

జగన్ వ్యవహార శైలి మాత్రమే కాకుండా బొత్స సత్యనారాయణ తీరని కూడా ఆయన తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. పార్టీలో ఉన్న ద్వంద్వ ప్రమాణాలను బండకేసి కొట్టారు. మజ్జి శ్రీను తనకు బావ కావడంతోనే జగన్ కక్ష కట్టారని అప్పలనాయుడు. అందువల్లే పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు. ఆ ప్రకారం అవుతా మజ్జి శ్రీను కూడా బొత్స సత్యనారాయణకు మేనల్లుడు అని.. అలాంటప్పుడు ఆయనను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అంటూ అప్పలనాయుడు ప్రశ్నించారు.

మొన్నటికి మొన్న మజ్జి శ్రీను.. ఇప్పుడు అప్పలనాయుడు.. రేపటి రోజున ఇంకెవరు పార్టీ నుంచి వెళ్ళిపోతారు తెలియని పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇటువంటి పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. విలేకరుల ముందుకు వచ్చి అధికారంలోకి వచ్చేది తామే అని జగన్ చెబుతుంటారు. కానీ వాస్తవంలో మాత్రం వేరే విధంగా ఉంది. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా పార్టీ నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది.

ధర్మాన ప్రసాదరావు.. ధర్మాన కృష్ణ దాస్ వ్యవహార శైలిని ఇటీవల కాలంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్ బయట పెట్టారు. ఆ తర్వాత జగన్ తమ్మినేని సీతారాం ను తాడేపల్లికి పిలిపించుకొని మాట్లాడారు. ఆయనకు శ్రీకాకుళం పార్లమెంటు స్థానం ఇస్తున్నట్లు ప్రకటించారు. మజ్జి శ్రీను టిడిపిలోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స సత్యనారాయణ కుమార్తెను నియమించారు. వాస్తవానికి టిడిపి కొడుతున్న దెబ్బకు ఉత్తరాంధ్రలో వైసీపీకి దిమ్మ తిరిగిపోతోంది. జగన్ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా.. ఇక్కడ అంతరం స్పష్టంగా కనిపించింది. పార్లమెంట్.. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో ఫలితం వచ్చే అవకాశం ఉంది.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
TANA Women : తానా మహిళల కోసం ప్రత్యేకంగా 'దేశీ డాన్స్ -RMK NEWS

250 మందికిపైగా హాజరు TANA మహిళలు : హంటర్స్‌విల్లే: మహిళల ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉత్తర అమెరికా…

19 hours ago
Good Morning

Good Morning

22 hours ago
ఒక పట్టుచీర గతంలో చేసిన ఓ దొంగను పట్టించింది.. - Jananethram News

[ad_1] హైదరాబాద్ క్రైం : పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన లోకం మొత్తం చీకటి కాదు.…

1 day ago
Media Owner : ఆ మీడియా అధినేత ఇంట్లో ఆస్తుల పంచాయితీ - RMK NEWS

Media Owner : ఎదుటి వాళ్ళ లైఫ్ లో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా లెన్స్ వేసుకొని…

1 day ago
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సైబర్ దొంగ - RMK NEWS

[ad_1] BRS మాజీ MLA : ప్రతి సమావేశంలోనూ కేటీఆర్ ఒకటే చెప్తున్నారు. 2028లొ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చేది…

1 day ago