Home జాతీయ‘భారత్‌లో ఇప్పుడు గతంలోలా శాంతి లేదు’.. సంజయ్ దత్ – RMK NEWS

‘భారత్‌లో ఇప్పుడు గతంలోలా శాంతి లేదు’.. సంజయ్ దత్ – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

సంజయ్ దత్ : బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ మరోసారి వార్తల్లో నిలిచారు. జయంతి సందర్భంగా శేఖర్ సుమన్ ‘శేఖర్ గాంధీ టునైట్’ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న సంజయ్ దత్.. దేశ రాజకీయాలు, ప్రస్తుత పరిస్థితులు, ప్రపంచ పరిణామాలపై తనదైన శైలిలో స్పందించారు. ముఖ్యంగా భారత్‌లో గతంలో ఉన్నంత శాంతి ఇప్పుడు కనిపించడం లేదంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

‘మునుపటిలా శాంతి ఫీల్ కావడం లేదు’

కార్యక్రమంలో సంజయ్ దత్ మాట్లాడుతూ.. భారతదేశ ప్రజలు ఎంతో ప్రేమతో, విశాల హృదయంతో ఉంటారని అన్నారు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరినీ ఆహ్వానించే సంస్కృతి భారతీయుల్లో ఉందని చెప్పారు. అయితే ప్రస్తుతం దేశంలో ఉన్నంత శాంతిని తాను అనుభవించలేకపోతున్నానని.

“ఈ దేశ ప్రజలు చాలా మంచివారు. ఇక్కడ శాంతి ఉండాలి. ఇప్పుడు నేను ఈ దేశంలో ఇంతకుముందులా శాంతిని ఫీల్ కావడం లేదు. మనం ఇండియన్స్ పెద్ద మనసున్న వాళ్లం. అందరినీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం. మనం ప్రపంచానికి చాలా ఇచ్చాం. ఇక ముందు కూడా అలాగే ఉండాలి. ఆ శాంతి, ఆ రోజులు త్వరగా తిరిగి రావాలని శివుడిని ప్రార్థిస్తున్నా” అని సంజయ్ దత్ అన్నారు. శాంతి ప్రేమతో వస్తుందని, ప్రేమను పెంచేందుకు ‘గాంధీగిరి’ అవసరమని ఆయన పేర్కొన్నారు.

ఐదు నిమిషాలు ప్రధానమంత్రిగా..

కార్యక్రమంలో సంజయ్ దత్‌ను ఐదు నిమిషాల పాటు దేశ ప్రధానమంత్రిగా ఊహించుకుని మాట్లాడమని. దీంతో ఆయన తన ‘మున్నాభాయ్’ పాత్రను గుర్తుచేసే స్టైల్‌లో సరదాగా, వ్యంగ్యంగా ప్రసంగించారు.

“నా ప్రియమైన దేశవాసులారా.. ఈరోజు నేను మీ పీఎంగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద దేశం, ఇంతమంది ప్రజలు.. ఇప్పుడు మనందరి నా మీద ఉంది. అయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను ఈ ఆనందాన్ని సెలబ్రేట్‌కి విదేశాలకు వెళ్లను. మీ మధ్యే ఉంటాను. లేకపోతే ప్రజలకు కనెక్షన్ ఎలా ఉంటుంది?” అంటూ చమత్కరించారు.

నాలుగో కోతి కావాలంటూ..

మహాత్మా గాంధీ మూడు కోతుల సిద్ధాంతాన్ని కూడా సంజయ్ దత్ తనదైన శైలిలో ప్రస్తావించారు. చెడు చూడకూడదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదనే మూడు కోతుల స్థానంలో ఇప్పుడు నాలుగో కోతి అవసరమని అన్నారు.

“చెడును చూస్తే దాన్ని సరిచేసేది ఎవరు? కళ్లను, చెవులను, నోటిని మూసుకుని కూర్చుంటే దేశం ఎలా ముందుకు వెళ్తుంది?” అంటూ ప్రశ్నించారు.

నాయకులపై ఫొటో సెటైర్

ప్రధాని ఫొటోలు ఎక్కడపడితే అక్కడ పెట్టే సంస్కృతిపై కూడా సంజయ్ దత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలో ఎక్కడ ప్రధానమంత్రి ఫొటో ఉందో అక్కడ వాటిని తగ్గించి, మహాత్మా గాంధీ ఫొటోలు పెట్టాలని అన్నారు. నాయకుల ఫొటోల కంటే దేశాన్ని, దేశ విలువలను ప్రజలకు చూపించడం ముఖ్యమని పేర్కొన్నారు.

ట్రంప్‌కు ‘జాదూ కీ ఝప్పీ’

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న టారిఫ్ విధానంపైనా సంజయ్ దత్ తనదైన శైలిలో స్పందించారు. ప్రపంచాన్ని ‘ఫ్రేమ్‌ నుంచి బయటకు పంపే’ ప్రయత్నాలు చేయొద్దని ట్రంప్‌ను ఉద్దేశించి అన్నారు. ప్రపంచంలో ఇప్పటికే ఎన్నో క్షిపణులు ఉన్నాయని, ఇక కొంత ప్రేమను కూడా ఎగుమతి చేయాలని సూచించింది.

ఎవరినైనా బెదిరించాలనిపిస్తే ముందుగా ఫోన్ చేసి ఇంటికి పిలిచి, చాయ్ తాగుతూ సమస్యను పరిష్కరించుకోవాలని అన్నారు. చివర్లో “అమెరికా.. నీకు జాదూ కీఝప్పీ ఇవ్వడానికి నేను వస్తున్నా” అంటూ ‘మున్నాభాయ్’ స్టైల్‌లో ముగించారు.

‘లగే రహో మున్నాభాయ్’లో గాంధీగిరి

సంజయ్ దత్ 2006లో విడుదలైన లగే రహో మున్నాభాయ్ చిత్రంలో మున్నాభాయ్ పాత్రలో నటించారు. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గాంధీగిరి సిద్ధాంతాన్ని వినోదాత్మకంగా చూపించారు. అర్షద్ వార్సీ కూడా కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది. తాజాగా సంజయ్ దత్ చేసిన వ్యాఖ్యలలోనూ అదే ‘గాంధీగిరి’ శైలి కనిపించడంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
TANA Women : తానా మహిళల కోసం ప్రత్యేకంగా 'దేశీ డాన్స్ -RMK NEWS

250 మందికిపైగా హాజరు TANA మహిళలు : హంటర్స్‌విల్లే: మహిళల ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉత్తర అమెరికా…

20 hours ago
Good Morning

Good Morning

23 hours ago
ఒక పట్టుచీర గతంలో చేసిన ఓ దొంగను పట్టించింది.. - Jananethram News

[ad_1] హైదరాబాద్ క్రైం : పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన లోకం మొత్తం చీకటి కాదు.…

1 day ago
Media Owner : ఆ మీడియా అధినేత ఇంట్లో ఆస్తుల పంచాయితీ - RMK NEWS

Media Owner : ఎదుటి వాళ్ళ లైఫ్ లో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా లెన్స్ వేసుకొని…

1 day ago
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సైబర్ దొంగ - RMK NEWS

[ad_1] BRS మాజీ MLA : ప్రతి సమావేశంలోనూ కేటీఆర్ ఒకటే చెప్తున్నారు. 2028లొ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చేది…

1 day ago