Home జాతీయకర్ణాటక డీకే శివకుమార్ : సీఎం సార్.. మీరే నాకు పెళ్లి చేయాలి.. – RMK NEWS

కర్ణాటక డీకే శివకుమార్ : సీఎం సార్.. మీరే నాకు పెళ్లి చేయాలి.. – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

కర్ణాటక డీకే శివకుమార్ : ప్రభుత్వ పథకాలు ఉంటాయి.. ప్రజలు పథకాలు అడుగుతుంటారు. కానీ కర్ణాటకలో ఓ గ్రామీణ వ్యక్తి మాత్రం ఏకంగా ‘పెళ్లి గ్యారంటీ’ కావాలంటూ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కోరాడు. ‘ఫైవ్ గ్యారంటీస్’లో ఇది కూడా చేర్చాలని కోరుతూ ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. ”సార్.. అమ్మాయిలకు గ్రామీణ అబ్బాయిలంటే ఇష్టం లేదు. ఎకరాల కొద్దీ భూమి ఉన్నా కూడా పెళ్లికి ముందుకు రావడం లేదు. మీరే ఏదైనా చేయాలి” అంటూ అతడు శివకుమార్‌ను కోరాడు.

అంటే.. ఉద్యోగం లేదు కాబట్టి పెళ్లి కావడం లేదు అంటే అదో సమస్య. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఉద్యోగం లేకపోయినా ఎకరాల భూమి ఉంది.. అయినా సరే.. సంబంధం మాత్రం ‘నాట్ ఇంట్రెస్టెడ్’ అంటోంది. దీంతో గ్రామీణ యువకుడికి అసలు సమస్య డబ్బు కాదా.. ‘లొకేషన్’నా అనే సందేహం మొదలైంది.

ఒకప్పుడు ”అబ్బాయికి ఎంత భూమి ఉంది?” అని అడిగేవారు. ఇప్పుడు ”ఎక్కడ ఉద్యోగం? ఎంత జీతం? సిటీ ఏది?” అని అడుగుతున్నారట. అబ్బాయి దగ్గర పది ఎకరాలు ఉన్నా.. వాటిని చూసి అమ్మాయి ”వావ్” అనడం కంటే ”మీ ఆఫీస్ ఎక్కడ?” అని అడిగే రోజులు వచ్చేశాయన్నమాట..

వ్యవసాయ భూమి ఎకరాలు పెరుగుతున్న కొద్దీ పెళ్లి సంబంధాలు తగ్గిపోతున్నాయనే వింత పరిస్థితి కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తోందని యువకులు చెబుతున్నారు. పంట పండుతుందో లేదో తెలియదు.. కానీ పెళ్లి సంబంధం వస్తుందా రాదా అనేది ఇంకా పెద్ద టెన్షన్‌గా మారిందట.

ఇక డీకే శివకుమార్ ముందున్న టాస్క్ కూడా చిన్నదేమీ కాదు. ఇప్పటికే ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత ప్రయాణం, ఆర్థిక సహాయం వంటి హామీలను అమలు చేస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు ”గ్రామీణ యువకుల పెళ్లిళ్లకు గ్యారంటీ” ఇస్తే ఎలా ఉంటుందోనని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ మాటల్లో కామెడీ కనిపిస్తుంది.. సమస్య మాత్రం సీరియస్‌గానే ఉంది. గ్రామీణ యువతలో వ్యవసాయం పట్ల ఆసక్తి తగ్గడం, పట్టణ ఉద్యోగాలకు ప్రాధాన్యత పెరగడం, జీవనశైలిలో మార్పులు రావడం.. ఇవన్నీ పెళ్లి సంబంధాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి.

అంటే చివరికి పరిస్థితి ఇలా మారిందన్నమాట..

అబ్బాయి దగ్గర భూమి ఉంది.. ఇల్లు ఉంది.. ఆస్తి ఉంది.. కానీ అమ్మాయి అడిగేది మాత్రం ”జాబ్ ఉందా?” అందుకే కర్ణాటక గ్రామీణ యువకుడి డిమాండ్ ఒక్కటే.. ‘ఫైవ్ గ్యారంటీస్’ చాలవు సార్.. మాకు ‘మ్యారేజ్ గ్యారంటీ’ కూడా కావాలి..

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
TANA Women : తానా మహిళల కోసం ప్రత్యేకంగా 'దేశీ డాన్స్ -RMK NEWS

250 మందికిపైగా హాజరు TANA మహిళలు : హంటర్స్‌విల్లే: మహిళల ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉత్తర అమెరికా…

18 hours ago
Good Morning

Good Morning

21 hours ago
ఒక పట్టుచీర గతంలో చేసిన ఓ దొంగను పట్టించింది.. - Jananethram News

[ad_1] హైదరాబాద్ క్రైం : పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన లోకం మొత్తం చీకటి కాదు.…

1 day ago
Media Owner : ఆ మీడియా అధినేత ఇంట్లో ఆస్తుల పంచాయితీ - RMK NEWS

Media Owner : ఎదుటి వాళ్ళ లైఫ్ లో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా లెన్స్ వేసుకొని…

1 day ago
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సైబర్ దొంగ - RMK NEWS

[ad_1] BRS మాజీ MLA : ప్రతి సమావేశంలోనూ కేటీఆర్ ఒకటే చెప్తున్నారు. 2028లొ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చేది…

1 day ago