Home జాతీయనరేంద్ర మోడీ: ఇండియా నుంచి భారత్‌గా పరివర్తన.. – RMK NEWS

నరేంద్ర మోడీ: ఇండియా నుంచి భారత్‌గా పరివర్తన.. – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

Narendra Modi : దేశ రాజకీయాల్లో కొన్ని నాయకత్వాలు ఎన్నికల విజయాలతో గుర్తుండిపోతాయి. సూచన నాయకత్వాలు పాలనా విధానాల్లో, ప్రజల ఆలోచనా ధోరణిలో తీసుకొచ్చిన మార్పులతో చరిత్రలో నిలిచిపోతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే.. రెండో కోణం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సెప్టెంబర్ 17న 76వ తేదీన ఏటపెట్టిన మోదీ.. ఇప్పటికీ నిరంతర కార్యాచరణతో ముందుకు సాగుతున్న ప్రధానమంత్రిగా కనిపిస్తున్నారు.

ప్రధాని పదవి అంటే కేవలం ప్రభుత్వాన్ని నిర్వహించడం మాత్రమే కాదనే భావనను మోదీ తన పనితీరుతో ముందుకు తెచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాలు, దేశ పర్యటనలు, సమీక్షలు, అంతర్జాతీయ సమావేశాలు, ప్రజా కార్యక్రమాలు.. ఇలా నిరంతర కార్యకలాపాలతో ఆయన రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వ్యక్తిగత ఆరోగ్యంపై పెద్దగా చర్చకు తావివ్వకుండా విధులకు ప్రాధాన్యత ఇవ్వడం ఆయన నాయకత్వ శైలిలో కనిపించే అంశం.

మోదీ పాలనలో మరో ముఖ్యమైన అంశం.. సంప్రదాయ రాజకీయాలను అభివృద్ధి, సంక్షేమం, సామాజిక మార్పుతో అనుసంధానం చేయడం. స్వచ్ఛ భారత్‌, యోగా, పర్యావరణ పరిరక్షణ, డిజిటల్‌ సాంకేతికత, పేదల కోసం వివిధ సంక్షేమ కార్యక్రమాలు వంటి ప్రభుత్వ కార్యక్రమాలు మాత్రమే కాకుండా ప్రజా ఉద్యమాలుగా మలిచేందుకు ప్రయత్నించారు. ప్రజల భాగస్వామ్యంతోనే దేశ ప్రగతి సాధ్యమనే సందేశాన్ని పదేపదే ముందుకు తెచ్చారు.

దేశ ప్రయోజనమే ముందున్న భావనను ప్రజల్లో బలపరచడం కూడా మోదీ రాజకీయ శైలిలో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. వ్యక్తి దేశం, రాజకీయాల కంటే జాతీయ ప్రయోజనం, హక్కులతో పాటు బాధ్యతలు అనే అంశాలను ఆయన ప్రసంగాల్లోనూ, కార్యక్రమాల్లోనూ ప్రస్తావిస్తూ వచ్చారు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో కనిపించిన దేశభక్తి, జాతీయ పునర్నిర్మాణ స్ఫూర్తిని కొత్త తరానికి పరిచయం చేసే ప్రయత్నం కూడా ఇందులో భాగమే.

‘ఇండియా’ నుంచి ‘భారత్’ వైపు సాగుతున్న చర్చ కూడా ఈ మారుతున్న ఆలోచన ధోరణికి ఒక ప్రతీకగా మారింది. ఇది కేవలం పేరుకు సంబంధించిన మార్పు కాదు.. దేశపు సాంస్కృతిక మూలాలు, చారిత్రక వారసత్వం, భారతీయ జీవన విధానంపై పెరుగుతున్న దృష్టికి ప్రతిబింబంగా చూడవచ్చు. ఈ పరివర్తనలో మోదీ నాయకత్వం ఒక ముఖ్యమైన పాత్ర పోషించిందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

అయితే ఏ ఏత్వాన్నైనా అంచనా వేయాలంటే ప్రశంసలతో పాటు పాలనా ఫలితాలు, ఆర్థిక వృద్ధి, ఉపాధి, సామాజిక సమానత్వం, ప్రజాస్వామ్య సంస్థల పనితీరు వంటి అనేక అంశాలను కూడా పరిశీలించాల్సిందే. అదే సమగ్ర విశ్లేషణకు ప్రాతిపదిక.

మోదీ రాజకీయ ప్రస్థానాన్ని ఒక వాక్యంలో చెప్పాలంటే.. రాజకీయ సంప్రదాయాల పరిధి దాటి దేశ నిర్మాణం, ప్రజల భాగస్వామ్యం, భారతీయ, స్వచ్ఛత, పర్యావరణం, యోగా వంటి అంశాలను జాతీయ చర్చల్లోకి తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నం ప్రత్యేకంగా నిలుస్తోంది.

ఇండియా నుంచి భారత్‌గా ఆలోచనా పరివర్తన.. అభివృద్ధితో పాటు భారతీయతను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం.. ఈ మార్పులో మోదీ నాయకత్వ ముద్ర ఎంతవరకు ఉందో తెలుసుకోవాలంటే ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

You may also like

Leave a Comment