Home జాతీయLovely professional University: తెలుగు విద్యార్థులు చదివే – RMK NEWS

Lovely professional University: తెలుగు విద్యార్థులు చదివే – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

Lovely professional University: అది అతిపెద్ద యూనివర్సిటీ. పైగా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారు.. ఈ యూనివర్సిటీలో వినూత్నమైన కోర్స్‌లు ఉండటంతో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ కంప్యూటర్ కోర్సులు వినయంగా ఉంటాయని.. ఇక్కడ చదివితే బహుళ జాతి సంస్థల్లో ఉద్యోగాలు గ్యారెంటీ అని తెలుగు విద్యార్థులు నమ్ముతారు. అందువల్లే ఇక్కడ భారీ సంఖ్యలో తెలుగు విద్యార్థులు చదువుతున్నారు. భారీగా తెలుగు విద్యార్థులు చదువుతున్న ఆ యూనివర్సిటీ పేరు […]

లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ: అది అతిపెద్ద యూనివర్సిటీ. పైగా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారు.. ఈ యూనివర్సిటీలో వినూత్నమైన కోర్స్‌లు ఉండటంతో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ కంప్యూటర్ కోర్సులు వినయంగా ఉంటాయని.. ఇక్కడ చదివితే బహుళ జాతి సంస్థల్లో ఉద్యోగాలు గ్యారెంటీ అని తెలుగు విద్యార్థులు నమ్ముతుంటారు. అందువల్లే ఇక్కడ భారీ సంఖ్యలో తెలుగు విద్యార్థులు చదువుతున్నారు.

భారీగా తెలుగు విద్యార్థులు చదువుతున్న ఆ యూనివర్సిటీ పేరు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. ఇది పంజాబ్ రాష్ట్రంలోని ఫగ్వారా అనే ప్రాంతంలో ఉంది. ఈ యూనివర్సిటీలో ఆదివారం తెల్లవారుజామున తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక విద్యార్థి మీద దారుణం జరిగింది.. ఆమె బలవంతంగా చనిపోయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో విద్యార్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. ఆందోళనకు దిగారు. అయితే ఈ ఆరోపణలు అప్పటి వరకు అధికారికంగా నిర్ధారణకు గురికాలేదని పోలీసులు చెబుతున్నారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే ఆదివారం తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఆ తర్వాత జాతీయ రహదారి పైకి వచ్చారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పట్ల విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగాలని నిర్ణయించారు.

ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థుల క్యాంపస్‌లో కిటికీలను.. ఇతర వస్తువులను ధ్వంసం చేసినట్టు. ఇటుకలను.. పూల కుండీలలో వారు పగలగొట్టారు. వస్తువులకు నిప్పు పెట్టారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో జలంధర్.. పగ్వారా నేషనల్ హైవే మీద వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

విద్యార్థుల ఆందోళనకు కారణమైన ఘటనను అధికారికంగా నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో వ్యాప్తి చెందిన సమాచారమే ఆందోళనకు కారణమని అధికారులు చెబుతున్నారు. మరోవైపు విద్యార్థుల నుంచి వచ్చిన వాంగ్మూలాల పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో జరిగిన ఘటన కంటే ముందు ఒకరోజు చిత్కారా యూనివర్సిటీలో కూడా విద్యార్థులు ఇదే స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఫలితంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ రెండు గంటలకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రెండు సంఘటనలకు ఎటువంటి సంబంధం లేదని పోలీసులు గుర్తించారు.

కేవలం సోషల్ మీడియాలో వచ్చిన విద్యార్థుల్లో ఈ స్థాయిలో ఆందోళనకు కారణమైంది. నిజానికి అది నిజమా? అబద్ధమా? అని నిర్ధారించుకుంటే బాగుండేది. అలాకాకుండా విద్యార్థులు బీభత్సకాండకు దిగడంతో పరిస్థితి ఇంతకు దిగజారింది. అయితే ఇప్పుడు యూనివర్సిటీలో అదుపులోకి వచ్చిందని.. పోలీసుల పరిస్థితి అక్కడ మీడియాలో వస్తున్న వార్తల ద్వారా తెలుస్తోంది. క్రమశిక్షణకు పెట్టింది పేరైన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఇలాంటి దారుణం జరగడానికి విద్యార్థుల తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.

You may also like

Leave a Comment