Home క్రీడలుకార్తీ:ఆ పని ముందు చెయ్.. తమిళనాడు సీఎం విజయ్ కి కార్తీ – RMK NEWS

కార్తీ:ఆ పని ముందు చెయ్.. తమిళనాడు సీఎం విజయ్ కి కార్తీ – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


కార్తీ:కార్తీ.. తమిళనాడులోని కాకుండా.. దక్షిణాది రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు. మొదట్లో చిత్ర పరిశ్రమకు సూర్య తమ్ముడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కార్తీ అన్నయ్య సూర్య అంటే అంతగా తన స్థాయిని పెంచుకున్నాడు. విభిన్నమైన సినిమాలతో తనకంటూ సొంత మేనరిజాన్ని సృష్టించుకున్నాడు కార్తీ. సమాజ హితమైన కార్యక్రమాలలో కార్తీ పాల్గొంటాడు. ఆమధ్య రైతుగా అతడు నటించిన ఓ సినిమా తమిళనాడులో అతిపెద్ద విజయాన్ని అందుకుంది. ఆ సమయంలో చాలామంది రైతులకు ఆర్థికంగా […]

కార్తీ:కార్తీ.. తమిళనాడులో కాకుండా.. దక్షిణాది రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు. మొదట్లో చిత్ర పరిశ్రమకు సూర్య తమ్ముడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కార్తీ అన్నయ్య సూర్య అంటే అంతగా తన స్థాయిని పెంచుకున్నాడు. విభిన్నమైన సినిమాలతో తనకంటూ సొంత మేనరిజాన్ని సృష్టించుకున్నాడు కార్తీ.

సమాజ హితమైన కార్యక్రమాలలో కార్తీ పాల్గొంటాడు. ఆమధ్య రైతుగా అతడు నటించిన ఓ సినిమా తమిళనాడులో అతిపెద్ద విజయాన్ని అందుకుంది. ఆ సమయంలో చాలామంది రైతులకు కార్తి ఆర్థికంగా సహాయం అందించారు. తన సోదరుడు ఫౌండేషన్ కి కూడా తనవంతుగా సహాయం అందిస్తూ ఉన్నాడు. విద్యార్థులకు.. యువతకు తనవంతుగా బాసటగా నిలుస్తున్నాడు. సమాజ హితమైన కార్యక్రమాలలో పాల్గొనే కార్తి.. తాజాగా కోయంబత్తూర్ వెళ్ళాడు.

అక్కడ ఏం జరిగింది అంటే

కోయంబత్తూర్ ప్రాంతంలో మాజీ పోలీసు అధికారుల ప్రజా సంక్షేమ ట్రస్ట్ వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్తి ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కి నేరుగా సవాల్ విసిరాడు. పోలీసులు వారంపాటు విధులు నిర్వహించిన తర్వాత ఒకరోజు సెలవు తీసుకునే విధానం అమల్లోకి రావాలని సూచించారు. ఈ అమల్లోకి తీసుకొస్తామని కొత్త ప్రభుత్వం ప్రకటించిందని.. కానీ ఇంతవరకు అది అమల్లోకి రాలేదని కార్తీ వాపోయారు.

“పోలీసుల మీద భారం తగ్గాలి. వారి శారీరక.. మానసికంగా మెరుగ్గా ఉండాలి.. ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. పోలీస్ స్టేషన్‌లో జిమ్ లు నిర్వహిస్తున్నారు.. పని ఒత్తిడి కారణంగా వాటిని ఉపయోగించుకోలేకపోతున్నారు. కార్తి సూచిస్తుంది.

కార్తీ చేసిన వ్యాఖ్యలను కొన్ని తమిళ మీడియా సంస్థలు టీవీకే ప్రభుత్వం మీద విమర్శగా ఉన్నాయి. అయితే ఇతర కథనాలలో మాత్రం ఆయన ప్రధానంగా పోలీసుల వారంతపు సెలవులు.. పని భారం.. ఆరోగ్యం.. సోషల్ మీడియా ఒత్తిడి వంటి అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

కార్తీకి తమిళ ముఖ్యమంత్రి విజయ్ కి మంచి సంబంధాలు ఉన్నాయి. కాకపోతే ప్రజా సమస్యలను ప్రస్తావించే విషయంలో కార్తి ఏమాత్రం వెనుకాడడు. గతంలో డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా రైతుల కార్తి ఇదే విధంగా ప్రస్తావించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు అండగా నిలిచారు. రైతులు ఆత్మహత్య చేసుకోకూడదని.. ధైర్యంగా ఉండాలని సూచించారు.



You may also like

Leave a Comment