Home క్రీడలుసినీ పరిశ్రమ: ప్రేక్షకుల జేబులకు చిల్లులు.. – RMK NEWS

సినీ పరిశ్రమ: ప్రేక్షకుల జేబులకు చిల్లులు.. – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


సినిమా పరిశ్రమ: సినిమా అనేది కోట్ల రూపాయల వ్యాపారం. ఒక సినిమా వెనుక ఎంతోమంది శ్రమ ఉంటుంది. నిర్మాత.. దర్శకుడు.. హీరో, హీరోయిన్లు.. టెక్నీషియన్లు.. డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్లు.. ఇలా అనేక రకాల వ్యక్తుల సమూహం ఉంటుంది. ఒక సినిమా కనుక విజయం సాధిస్తే ఈ వ్యవస్థ మొత్తానికి భారీగా డబ్బు వస్తుంది. విజయాల శాతం చాలా తక్కువ సినిమా పరిశ్రమలో విజయాల శాతం చాలా తక్కువగా ఉంటుంది. సినిమా పరిశ్రమలో అధికంగా పారితోషకాలు ఉంటాయి. సహజంగా వీటిని […]

సినిమా పరిశ్రమ: సినిమా అనేది కోట్ల రూపాయల వ్యాపారం. ఒక సినిమా వెనుక ఎంతోమంది శ్రమ ఉంటుంది. నిర్మాత.. దర్శకుడు.. హీరో, హీరోయిన్లు.. టెక్నీషియన్లు.. డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్లు.. ఇలా అనేక రకాల వ్యక్తుల సమూహం ఉంటుంది. ఒక సినిమా కనుక విజయం సాధిస్తే ఈ వ్యవస్థ మొత్తానికి భారీగా డబ్బు వస్తుంది.

విజయాల శాతం చాలా తక్కువ

సినిమా పరిశ్రమలో విజయాల శాతం చాలా తక్కువగా ఉంటుంది. సినిమా పరిశ్రమలో అధికంగా పారితోషకాలు ఉంటాయి. సహజంగా వీటిని భర్తీ చేయడానికి నిర్మాతలు వివిధ మార్గాల ద్వారా ఆదాయాలు సంపాదించుకుంటారు. ఇటీవల కాలంలో భారీ చిత్రాలను ఉత్పత్తి నిర్మాతలు టికెట్ రేట్లను పెంచుకునే వెసలు బాటును పొందుతున్నారు. కాపీరక రకాల ఆరోపణలు వస్తున్నప్పటికీ.. నిర్మాతలు తమకున్న మార్గాల ద్వారా టికెట్ రేట్లను పెంచుతున్నారు. సినిమా టికెట్ ధరలు పెంచడం.. సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తుల ఆదాయం.. పన్నుల లెక్కలపై వివాదాలు రావడం.. వంటిది ప్రేక్షకుల్లో అసంతృప్తికి కారణమవుతున్నాయి. ఎవరైనా సరే ఆదాయపు పన్ను కట్టలేదు అని నిర్ధారించాలి అంటే కచ్చితంగా అధికారిక దర్యాప్తు.. ఆధారాలు.. సంబంధిత అధికారుల నిర్ణయం కచ్చితంగా ఉండాలి. కేవలం సోదాలు జరిగినంత మాత్రాన.. ఒక వ్యక్తి ఐటి కట్టలేదు అని చెప్పడం నిజం కాదు.

ఐటి దాడులు కొత్త కాదు

సినిమా రంగంలో వారి మీద ఐటి దాడులు కొత్తవి కాదు. సరిగా సోమవారం కూడా ఒక ప్రముఖ కథానాయక ఇంట్లో.. ఆమె మామ ఇంట్లో కూడా తనిఖీలు జరిగాయి. ఏకకాలంలో 12 ప్రాంతాల్లో అధికారులు సోదాలు జరిపారు. దీంతో మరోసారి సినిమా ఇండస్ట్రీ గురించి మరోసారి చర్చ మొదలైంది.. ఈ నేపథ్యంలోనే సినిమా రంగంలో నల్ల డబ్బు ఎక్కువగా ఉంటుందని.. పన్నులు చెల్లించకుండా ఉంటారని.. రకరకాలుగా అక్రమాలకు పాల్పడుతున్నారని అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఆధారాలు ఉంటేనే దాడులు

ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్పష్టమైన ఆధారాలు ఉంటేనే దాడులు చేస్తారు. సోదాలు చేపడతారు. ఆదాయపు లెక్కల్లో.. చెల్లించే పన్నుల వ్యవహారంలో తేడా ఉంటేనే ఐటీ అధికారులు రంగంలోకి దిగుతారు. ఇందులో రాజకీయాలకు అవకాశం ఉండదు. వ్యక్తిగత లక్ష్యాలకు ఆస్కారం ఉండదు. ఇటీవల కాలంలో టికెట్ ధరల పెంపు అనేది సాధారణంగా మారిపోయింది. ఈ ధరల పెంపు వల్ల వచ్చే ఆదాయం ఎవరి జేబులోకి వెళ్తోంది అనేది చిదంబర రహస్యం లాగా మారిపోయింది. ప్రభుత్వాలు సహకరించడంతో నిర్మాతలు.. ఇతర సినీ రంగ వ్యక్తులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రేక్షకులను దేవుళ్ళు అని చెబుతూనే.. వారి జేబులకు చిల్లులు పెడుతున్నారు.

జవాబుదారీ ఉండాలి

ఒక సినిమా ద్వారా నిర్మాత సంపాదించిన ఆదాయం.. ఇతర వ్యక్తులు సంపాదించిన సొమ్ముకు కచ్చితంగా జవాబుదారీగా ఉండాలి. ఎందుకంటే ప్రేక్షకులు జేబులో నుంచి డబ్బులు తీస్తేనే వీరందరికీ డబ్బులు వస్తాయి. ప్రేక్షకులకు డబ్బులు ఉచితంగా రావు కదా. టికెట్ ధరను ప్రేక్షకులు చూస్తున్నారంటే అది సినిమా మీద ఉన్న అభిమానం.. సినిమాలో నటించిన వారి మీద ఉన్న అభిమానం. కానీ ఈ అభిమానాన్ని ఇలా క్యాష్ చేసుకోవడం.. వారి జేబులకు చిల్లు పెట్టడం భావ్యం కాదని విశ్లేషకులు అంటున్నారు.. ఇష్టానుసారంగా టికెట్ ధరలు పెంచడం.. ప్రేక్షకులకు ఇబ్బంది పెట్టడం పరిపాటిగా మారిందని విశ్లేషకులు అంటున్నారు.



You may also like

Leave a Comment