Home క్రీడలుPradeep Advaitham:టాలీవుడ్ లో యువ దర్శకుడి ఇంట్లో తీవ్ర – RMK NEWS

Pradeep Advaitham:టాలీవుడ్ లో యువ దర్శకుడి ఇంట్లో తీవ్ర – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


Pradeep Advaitham: టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. యువ దర్శకుడి ఇంట్లో దుఃఖపూరితమైన వాతావరణం ఏర్పడింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ యువ దర్శకుడిగా పేరు సంపాదించుకున్న ప్రదీప్ అద్వైతం ఆదివారం తెల్లవారుజామున ఘోరం జరిగింది. దీంతో ఆయన కుటుంబం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. ఆయనను ఓదార్చడం ఎవరితరమూ కావడం లేదు. ఈ హఠాత్ పరిణామంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రదీప్ కుమార్ అద్వైతం సతీమణి మాడుగుల దీప్తి […]

ప్రదీప్ అద్వైతం: టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. యువ దర్శకుడి ఇంట్లో దుఃఖపూరితమైన వాతావరణం ఏర్పడింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ యువ దర్శకుడిగా పేరు సంపాదించుకున్న ప్రదీప్ అద్వైతం ఆదివారం తెల్లవారుజామున ఘోరం జరిగింది. దీంతో ఆయన కుటుంబం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. ఆయనను ఓదార్చడం ఎవరితరమూ కావడం లేదు. ఈ హఠాత్ పరిణామంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ప్రదీప్ కుమార్ అద్వైతం సతీమణి మాడుగుల దీప్తి రెడ్డి మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు. ప్రదీప్ తన కెరియర్లో అద్వైతం అనే షార్ట్ ఫిలిం ప్రదర్శించారు. ఈ సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ లఘు చిత్రంలో ఎంపికైంది. ఆ తర్వాత ఆయన ఆ గుర్తింపుతో తన ఇంటి పేరును అద్వైతం అని మార్చుకున్నారు. అప్పటినుంచి ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నారు.

ప్రతి దర్శకత్వంలో బిల్లా రంగా.. మైనే ప్యార్ కియా వంట చిత్రాలను రూపొందించారు. సి అశ్వని దత్ నిర్మించిన ఛాంపియన్ అనే సినిమాకు ఈయన దర్శకత్వం వహించారు. ఇందులో సీనియర్ నటుడు శ్రీకాంత్ మేక కుమారుడు రోషన్ మేక హీరోగా నటించాడు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది.

ప్రదీప్ సతీమణి దీప్తి రెడ్డి మహిళా పారిశ్రామికవేత్తగా కొనసాగుతున్నారు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారు. మహిళలు ఆర్థికంగా.. సామాజికంగా ఎదగడానికి సేవలు అందిస్తున్నారు. ఎంతోమంది మహిళలకు ఆమె ప్రోత్సాహం అందించారు. వారు తమదైన రంగాలలో ఎదగడానికి సలహాలు.. సూచనలు ఇస్తున్నారు. దీప్తి రెడ్డికి ఆధ్యాత్మిక భావాలు ఎక్కువగా ఉంటాయి. ఈయనకు తెలంగాణ సమాజం అంటే చాలా ఇష్టం. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను ఆమె పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఏడాది బతుకమ్మ పండుగను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇటీవల దీప్తి రెడ్డికి తీవ్రమైన మెదడు సంబంధిత సమస్య వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే గచ్చిబౌలి ప్రాంతంలోని కిమ్స్ హాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు అత్యవసరమైన శాస్త్ర చికిత్స చేశారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి దారుణంగా మారడంతో ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ప్రదీప్.. దీప్తి దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానం. దీప్తి అంత్యక్రియలు ఆదివారం ఉదయం హైదరాబాదులో ఫిలింనగర్ లో మహాప్రస్థానం జరిగింది. దీప్తి చనిపోవడంతో.. సినీ ప్రముఖులు.. ఇతర విభాగాల వారు ఆమెకు సానుభూతి తెలిపారు.



You may also like

Leave a Comment